అమ్మ షాడో శశికళ పాత్రలో

0

అమ్మ జయలలితపై వరుస బయోపిక్ లు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యామీనన్.. కంగన .. రమ్యకృష్ణ వంటి స్టార్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ టైటిల్ పాత్రల్లో నటిస్తుండడంతో ఊహించని కాంపిటీషన్ మొదలైంది. కంగన ప్రధాన పాత్రలో తలైవి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఈ పోస్టర్ కం టీజర్ కి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. నిత్యా `ది ఐరన్ లేడీ` లుక్ ఇంతకుముందు రిలీజ్ చేశారు. అమ్మ పాత్రకు నిత్యానే పర్ ఫెక్ట్ అన్న ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ లుక్ కూడా రివీలైంది. దీనికి అద్భుత స్పందన వస్తోంది.

ఇకపోతే ప్రతి సినిమాలో అమ్మ షాడో శిశికళ పాత్ర కూడా ఇంపార్టెంట్ కానుంది. తాజాగా కంగన నటిస్తున్న తలైవిలో శశికళ పాత్రకు నటిని ఎంపిక చేశారు. జాతీయ ఉత్తమనటి ప్రియమణిని అమ్మ షాడో పాత్రకు ఎంపిక చేశారని తెలుస్తోంది. తనవైన నేచురల్ లుక్స్ .. పెర్ఫామెన్సెస్ తో మెప్పించే సత్తా ప్రియమణికి ఉంది. అందుకే ఈ పాత్రకోసం ఏరికోరి ఏ.ఎల్.విజయ్- విష్ణువర్ధన్ బృందం ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.

తమిళ రాజకీయాల్లో శశికళ ప్రస్థానం గురించి తెలుసుకునే కొద్దీ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అమ్మ వెంటే ఉండి తనకు వెన్నుపోటు పొడిచే ప్లాన్ వేసిన షాడో శశికళ అని చెబుతారు. అమ్మకు నమ్మినబంటుగా ఉన్నా రాజకీయాల్లో తనదైన శైలిలో చక్రం తిప్పిన మేటి వ్యూహకర్తగా శశికళకు తమిళ రాజకీయాల్లో పేరుంది. దుర్భేధ్యమైన మన్నార్ గుడి మాఫియా శశికళ చుట్టూ పలు అంచెల్లో ఉండేదని ఒకానొక దశలో అమ్మకే చెక్ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని కలగందని చెబుతారు. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ పాత్రనో ఊహించగలం. అందుకే ఈ పాత్రకు ప్రియమణిని ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ప్రియమణి డీసెంట్ పెర్ఫామెన్స్ మెప్పించింది. ఓటీటీ వేదికపై గ్రేషేడ్ ఉన్న పాత్రలో ప్రియమణి నటనకు ప్రశంసలు దక్కాయి.
Please Read Disclaimer