లేడీ ‘అసురన్’ ఎవరంటే..?

0

తమిళం లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు మరియు ఒరిజినల్ వర్షన్ నిర్మాత కళై పులి థానులు ఈ రీమేక్ ను నిర్మించబోతున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇదే సమయంలో చిత్రం కోసం నటీనటులను ఎంపిక చేసే పని కూడా చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అసురన్ చిత్రంలో ధనుష్ కు జోడీగా మంజు వారియర్ నటించిన విషయం తెల్సిందే. ఆ పాత్రను తెలుగులో ఎవరు చేస్తారా అంటూ గత కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. శ్రియతో పాటు పలువురు హీరోయిన్స్ పేర్లు ప్రస్థావన కు వచ్చాయి. చివరకు ఈ రీమేక్ కోసం ప్రియమణిని కన్ఫర్మ్ చేసినట్లు గా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈమద్య కాలంలో ప్రియమణి వెండి తెరపై కనిపించింది లేదు. ఇటీవల ఈ అమ్మడు ఒక వెబ్ సిరీస్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ వెబ్ సిరీస్ తో ఈ అమ్మడికి అసురన్ చిత్రం రీమేక్ లో వెంకీకి జోడీగా నటించే అవకాశం వచ్చింది. ఈనెల 22న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదటి వారం రోజుల తర్వాత ప్రియమణి షూటింగ్ లో పాల్గొనబోతుందని అంటున్నారు. ఈ రీమేక్ పై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అంచనాలను అందుకునేలా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడో చూడాలి.
Please Read Disclaimer