మంచి పని కోసం నిధులు సేకరిస్తున్న ప్రియమణి

0

టాలీవుడ్ – కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా కనిపించిన ప్రియమణి గత కొన్నాళ్లుగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఈ అమ్మడు అప్పుడప్పుడు బుల్లి తెరపై కనిపిస్తూ వస్తోంది. వెండి తెరపై అవకాశాలు తగ్గడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తోంది. ఈ అమ్మడు తాజాగా ఒక మంచి పనికోసం నిధులు సేకరించే పనిలో పడింది. ‘స్టే ఎట్ స్కూల్’ అనే స్వచ్చంద సంస్థలో భాగస్వామి అయిన ప్రియమణి అమ్మాయిల చదువు కోసం తనవంతు కృషి చేస్తుంది.

స్కూల్ మద్యలో వదిలేసిన వారు – ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని అమ్మాయిలకు స్టే ఎట్ స్కూల్ సంస్థ వారు ఆర్థిక సాయం చేసి మళ్లీ స్కూల్ లో జాయిన్ చేయించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిలు విద్యను పొందుతున్నారు. అందుకే ప్రియమణి ఆ సంస్థలో భాగస్వామ్యం అయ్యి ఫండ్స్ రైజ్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. స్కూల్ పిల్లలకు టాయిలెట్స్ లేక పోవడం – అమ్మాయిలకు కావాల్సిన బేసిక్ శానిటరీ సదుపాయాలను కల్పించేందుకు తమ వంతు సాయం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

మే 19న 10కే రన్ నిర్వహించి స్టే ఎట్ స్కూల్ సంస్థ కోసం ఫండ్స్ సేకరించాలని భావిస్తుంది. ఈ 10 కే రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసి కనీస వసతులు లేని అమ్మాయిల చదువుకు మీ వంతు సాయం చేయండి అంటూ ప్రియమణి కోరుతోంది. హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఇలాంటి స్వచ్చంద సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రియమణి ఇలా ముందుకు రావడం నిజంగా అభినందనీయం.




Please Read Disclaimer