గలాటా లేని గ్యాంగ్ లీడర్ బ్యూటీ

0

ఎల్లుండి నాని గ్యాంగ్ లీడర్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. సాహో తర్వాత వచ్చిన రెండు వారాల గ్యాప్ ని మంచి ఓపెనింగ్స్ తో భర్తీ చేస్తాడని ట్రేడ్ బోలెడు ఆశలు పెట్టుకుంది. హైప్ ఆ స్థాయిలో లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నానికి టాక్ కనక పాజిటివ్ గా వస్తే నమ్మకం పెట్టుకోవచ్చు. కాకపోతే కథ ఏ జోనర్ లోదో అర్థం కానీ స్టైల్ లో ట్రైలర్ ని కట్ చేయడం కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తున్నప్పటికీ గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ మీద మెగా ఫాన్స్ గట్టి టార్గెటే పెట్టుకున్నారు.

దీని సంగతలా ఉంచితే హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ఎక్కడా హై లైట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. తనది అద్భుతమైన అందం కాదు కానీ చూడగానే ఆకట్టుకునే కళ అయితే ప్రియాంకాలో ఉంది. ఇక్కడే ఓ చిక్కు ఉంది. మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే అంశం కానీ ఎక్స్ పోజ్ చేసే అవకాశం ఉన్న గ్లామర్ కానీ ప్రియాంకాలో అంతగా కనిపించడం లేదు.

అందులోనూ విక్రమ్ కుమార్ వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టడు కాబట్టి తనకు ఆ ఛాన్స్ అయితే లేదు. మనం – 24లలో హీరోయిన్ థ్రెడ్ వీక్ గా ఉన్నా సమంతా ప్రెజెన్స్ వాటిని కాపాడింది. కానీ గ్యాంగ్ లీడర్ లో ప్రియాంకా కొత్త భామ. చేసిందే కన్నడలో ఒక్క సినిమా. అదీ పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫ్యాక్టర్ వీక్ గా కనిపిస్తున్న గ్యాంగ్ లీడర్ ఫైనల్ గా నాని మీద కంటెంట్ మీద ఆధారపడాల్సిందే.
Please Read Disclaimer