మూగబాసలు చేసుకుంటున్న గ్లోబల్ జంట

0

గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా ఈమధ్య సినిమాల విషయంలో కాకుండా తన డ్రెస్సింగ్ విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఫ్యాన్స్ కు.. మద్దతుదారులకు ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్టుగా ప్రియాంక ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తుంది కానీ నెటిజన్లు మాత్రం సెటైర్లతో చంపేస్తున్నారు. అయితే ఫర్ ఎ చేంజ్ అన్నట్టుగా తాజాగా సాధారణమైన దుస్తుల్లో ఫోటోలకు పోజిచ్చింది. వాటిలో ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఈ ఫోటోకు “అది గాలిలో ఉంది” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఆ క్యాప్షన్ తో పాటు ఒక లవ్ ఎమోజిని జోడించింది. ఫోటోలో తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఒక రొమాంటిక్ పోజిచ్చింది. ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇంటి దగ్గర మెట్ల మీద ఇద్దరూ కలిసి ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసుకొని మూగ బాసలు చేసుకుంటూ నిలబడ్డారు. ప్రియాంక ఒక చేతిని నిక్ గారి భుజంపై వేస్తే.. ఆయనగారేమో ప్రియాంక నడుముపై చేయి వేసి రొమాంటిక్ పోజిచ్చాడు. ఇద్దరూ ఒక లాంటి తన్మయత్వంలో ఉన్నారు.

ఈ ఫోటోకు ఇన్స్టాగ్రామ్ లో భారీ స్పందన లభించింది. 11 గంటల్లోనే 1.7 మిలియన్ లైక్స్ వచ్చాయి. “అది గాలిలో ఉంది” క్యాప్షన్ కు రెస్పాన్స్ గా చాలామంది “ప్రేమ గాలిలో ఉంది” అంటూ సమాధానం ఇచ్చారు. “క్యూట్.. రొమాంటిక్ కపుల్”.. “లవ్లీ పోజు.. ఇటలీ లోనా”.. “ప్రెగ్నెంట్ అయ్యావా.. నిక్ అలా పట్టుకున్నాడు ఏంటి?” అంటూ కామెంట్లు పెట్టారు. ఒక సెటైర్లు వేసే బ్యాచ్ మామూలుగా హంగామా చెయ్యలేదు. “అక్కలా ఉన్నావు” అని ఒకరంటే “హై-లో ఉన్నావా.. పట్టుకొని నడిపిస్తున్నాడు అని మరొకరు తగులుకున్నారు.Please Read Disclaimer