ప్రియానిక్.. ఆ తప్పుడు మ్యాగజైన్ అలా రాసింది

0

జంట అంటే ఇలా ఉండాలి. దాంపత్యం అంటే ఇంత ఆదర్శంగా ఉండాలి. ప్రియానిక్ జోడీని చూస్తే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. అమెరికా నటుడు సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికా కోడలు అయిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత భర్తతో ఎంతో అన్యోన్యంగా సెలబ్రేషన్ మూడ్లోనే గడిపేస్తోంది. మామ్ మధు చోప్రాతో కలిసి ప్రియాంక చోప్రా విదేశీ విహారాల్లోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇక భర్తతో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి అయితే అసలు తిరుగే లేదు.

జీవితం ఉన్నది అనుభవించేందుకేనని ఈ జంటను చూస్తే అర్థమవుతుంది. లైఫ్ ఈజ్ యాన్ ఈవెంట్! ప్రతి మూవ్ మెంట్ ని ఎంజాయ్ చేయాలన్న తపన వీళ్లలో కనిపిస్తుంది. అందుకే ప్రతిసారీ పీసీ సామాజిక మాధ్యమాల్లో ఏ ఫోటోని షేర్ చేసినా అది అభిమానుల్లోకి వైరల్ గానే వెళుతోంది. ప్రస్తుతం పీసీ తన మామ్ మధుచోప్రాతో కలిసి న్యూయార్క్ లో ఉంది.

అప్పుడప్పుడు అలా న్యూయార్క్ వీధుల్లో చిలౌట్ చేసేందుకు వెళ్లినా ఆ గ్లింప్స్ ని అభిమానులకు చేరవేయడంలో పీసీ చాలానే అడ్వాన్స్ డ్ గా ఉంటోంది. భర్త నిక్ మామ్ మధు చోప్రాలతో కలిసి పీసీ అలా వీధుల్లో షికార్లకు వెళుతున్న ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోలు జోరుగానే వైరల్ అవుతున్నాయి.

ప్రియానిక్ ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నారు. డిజైనర్ హంగామా లేని స్పెషల్ డ్రెస్ లో పీసీ సింపుల్ గానే కనిపిస్తోంది. అన్నట్టు ఇంత అన్యోన్యంగా ఉన్న ఈ జంటపై అప్పట్లో ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ సంచలన కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. పీసీతో నిక్ జోనాస్ గొడవ పడుతున్నాడని .. ఆ ఇద్దరికీ అస్సలు పడటం లేదని విడాకులు తీసుకోబోతున్నారని కథనాలు ప్రచురించింది. దానిపై ఆ తర్వాత పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ పరంగా చూస్తే.. పీసీ తదుపరి నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ భారీ సూపర్ హీరో సిరీస్ లో నటించనున్న సంగతి తెలిసిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home