సిగరెట్ ఊదే నువ్వు నీతులు చెబుతావా?

0

నీతులు ఉన్నది ఎదుటివారికి చెప్పేందుకే! తాము పాటించేందుకు కాదు!! అన్నట్టుగానే ఉంది ఈ అమ్మడి వ్యవహారం. ఈ మాట అంటున్నది మేం కాదు.. తనని విపరీతంగా ఆరాధించే వీరాభిమానులే. ఇంతకీ అమెరికా కోడలు పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా అంతగా అనకూడని మాట ఏం అందని.. చేయకూడని తప్పు ఏం చేసిందని!? అంటే వివరాల్లోకి వెళ్లాలి.

ఈ అమ్మడు ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం దిల్లీ వెళ్లింది. అక్కడ షూటింగ్ చేస్తున్నంత సేపూ మాస్క్ ధరించాల్సి వచ్చిందట. ఆ గాలి పీల్చాలంటే రక్షణ అవసరం అని సెటైర్ వేసింది. మా వరకూ మాస్కులు.. గాలిని శుభ్రపరిచే ప్యూరిఫయర్లు ఉన్నాయి. మరి దిల్లీలో అవేవీ అందుబాటులో లేని ప్రజల పరిస్థితేమిటో..! అంటూ జాలి కురిపించింది. అసలే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దిల్లీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే విపరీతమైన కాలుష్యం వల్ల అక్కడ గాలిలో మంచులో దుమ్ము ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయిట. విషతుల్యం అయిన గాలిని పీల్చి పలువురు అస్వస్థతకు గురవ్వడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో సందు చూసి పీసీ సెటైర్లు పేల్చింది. అది కూడా ఇలా మూతికి మాస్క్ ధరించి పెద్ద పంచ్ వేసింది ప్రభుత్వాలపై.

అయితే నీతులు చెప్పేవాళ్లుంటే వాళ్లకు గోతులు తవ్వే వాళ్లు కూడా ఉంటారు! అన్నట్టుగానే ప్రస్తుతం నెటిజనం పీసీ తీరుతెన్నులపై విరుచుకుపడుతున్నారు. వీలు చిక్కితే ఫ్లూటుగా మందేసి చిందేస్తూ .. అలాగే ప్రయివేటు పార్టీల్లో సిగరెట్ వెలిగించి గుప్పుగుప్పుమని పొగ వదిలే ఈ అమ్మడు నీతులు చెబుతోందా? అంటూ పలువురు నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. విదేశీ కల్చర్ కి అలవాటు పడిన పీసీ భర్తతో కలిసి సిగరెట్ పొగ పీలుస్తూ ఇంతకుముందు దొరికిపోయింది. ఆ ఫోటోలు నెటిజనుల్లో జోరుగా వైరల్ అయ్యాయి. విదేశాల్లో బోట్ షికార్ చేస్తూ ఓపెన్ టాప్ పార్టీలో సిగార్ వెళిగించింది పీసీ. కొన్ని సందర్భాల్లో నిక్ తో కలిసి పీసీ వైన్ సిప్ చేస్తూ ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

ఆయన తో కలిసి ప్రతిసారీ పబ్లిక్ లో పెదవి ముద్దులతో చెలరేగిపోవడం .. అనవసర ఎక్స్ పోజింగ్ తో రెచ్చగొట్టడం వగైరా వగైరా లోపాల్ని వెతికి మరీ కాల్చుకు తిన్నారు మాయదారి నెటిజనం. `ద వైట్ టైగర్` సినిమా షూటింగ్ కోసం దిల్లీ వెళ్లినప్పుడు పీసీ మాస్క్ ధరించి షూటింగులో పాల్గొంది. అక్కడ గాలిని శుభ్రపరిచే ప్యూరిఫయర్లు .. మాస్క్ లు వగైరా ఉపయోగించారట. పాపం నిరాశ్రయులైన దిల్లీ ప్రజల కోసం ప్రార్థించండి!! అంటూ సెటైర్ వేసింది ఈ అమ్మడు. అంతే వెంటనే అలా నెటిజనులు ఆడేసుకున్నారు. ఇక్కడేమో ఇలా అక్కడేమో అలా! ఏమిటీ నీతులు! అంటూ చెడుగుడు ఆడేశారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home