హ్యాంగ్ ఓవర్ అంటున్న పీసీ

0

బాలీవుడ్ నటి – గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 2 న వీరిద్దరి మ్యారేజ్ ఇండియాలో జరుగబోతోంది. ప్రియాంక – నిక్ ల వివాహానికి జోధ్ పూర్ లోని ఓ ప్యాలెస్ ను వేదికగా ఎంచుకున్నారు. మొదటగా హిందూ ఆచారాల ప్రకారం.. ఆ తర్వాత క్రిస్టియన్ స్టైల్ లో వీరి పెళ్ళి జరుగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం న్యూయార్క్ లో బ్రైడల్ షవర్ పార్టీ జరిగింది. రీసెంట్ గా ఆమ్ స్టర్ డామ్ లో ప్రియాంక తన గర్ల్స్ గ్యాంగ్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ జరుపుకుంది. పరిణీతి చోప్రా.. శ్రిష్ఠి బెహెల్ ఆర్య.. తమన్నా దత్.. నటాషా పాల్.. చంచల్ డిసౌజా.. డనా సప్నిక్.. సోఫీ టర్నర్ ఈ పార్టీలో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేశారట. ఇక అలాంటి పార్టీ అంటే డ్రింక్స్ సర్వ్ చేయడం కామన్ కదా. దీంతో మరుసటి రోజుకు హ్యాంగ్ ఓవర్ తప్పదు.

అందుకే త్వరలో తోడికోడళ్ళు కానున్న ప్రియాంక చోప్రా – సోఫీ టర్నర్ ఇద్దరూ ‘హంగ్ ఓవర్’ అని రాసి ఉన్న మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ లు ధరించి ఫోటోకు పోజిచ్చారు. వాళ్ళను చూస్తుంటే తోడికోడళ్ళలా అనిపించడం లేదు. తోడబుట్టిన అక్కచెల్లెళ్ళలా ఉన్నారు. ఇక ముందురోజు పార్టీలో సోఫియా టర్నర్ ను వీపెక్కించుకుని మోస్తూ ప్రియాంక చాలా హంగామా చేసిందట. మొత్తానికి పీసీ హిమాలయాల అంచులదాకా.. సారీ.. ఆకాశం అంచులదాకా వెళ్ళి తిరిగొచ్చినట్టుంది కదా?
Please Read Disclaimer