అమెరికా కోడలు పచ్చడి లేనిదే బతకదు

0

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి? స్వదేశంలో దీనికి ఉన్న ప్రాధాన్యత విదేశాల్లో ఉంటుందా? అంటే చాలానే లోతుల్లోకి వెళ్లాలి. మనకు ప్రతిదానికి వర్జ్యం పూజ్యం అంటూ శరతులు వర్తిస్తాయి. పిల్లిని ఎదురు పెట్టుకుని ఎక్కడికీ వెళ్లకూడదని అంటారు పెద్దలు. కొన్ని చాదస్తం అనుకున్నా.. చాలా వరకూ కల్చర్ కి సంబంధించిన విషయాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో విదేశాలకు వెళుతున్న భారతీయ వనితలు ఎంతవరకూ కరెక్ట్ గా ఉంటారు? అన్న సందేహం వ్యక్తమవుతోంది. బాలీవుడ్ అందాల కథానాయిక ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లాడింది. అయితే తను అమెరికా వెళ్లాక మన సాంప్రదాయాల్ని పూర్తిగా విడిచి పెట్టేసిందా? అంటే తెలిసిన సంగతులివి..

తాను అమెరికాలో ఉంటున్నా.. చాలా సందర్భాల్లో పీసీ దేశీ గాళ్ అన్న సంగతి బయటపడింది. తాజాగా మరోసారి మరో రుజువు లభించింది. అమెరికా కోడలు ప్రియాంక చోప్రా రిచ్ యాటిట్యూడ్ తో పాశ్చాత్య సాంప్రదాయాన్ని వంట పట్టించుకుని ఉంటుందని సందేహించినా అలాంటిదేమీ లేదని తేలింది. అమెరికా వెళ్లాక కూడా పీసీ మన పద్ధతులేవీ మర్చిపోలేదు. ఈ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ పీసీ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాల్ని చెప్పింది. ఇప్పటివరకూ తనలోని ఆచారాలేవీ మారలేదని స్పష్టం చేసింది. తాను తినే ప్రతి ఆహారంలోనూ ఇండియన్ పచ్చడి ఉండాల్సిందేనట. ఛీజ్ శాండ్విచ్ తో మామిడికాయ పచ్చడి తింటే అది వండర్ ఫుల్ గా ఉంటుంది. ఆ మిక్స్ డ్ పికిల్ అంత రుచికరంగా ఉంటుంది.. అని చెప్పింది.

మన వాళ్లు ఎక్కడికి వెళ్లినా.. భారతీయ సాంప్రదాయాలు మర్చిపోవడం అన్నది ఉండదని దీనిని బట్టి చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మన సాంప్రదాయాల్ని ఎన్నారైలు ఎంతో గౌరవిస్తారు. ప్రతిదీ ఆచరిస్తారు. గుడులు గోపురాలు అమెరికాలోనూ ఎక్కువే. ఆ మేరకు తెలుగు వాళ్లు సంస్కృతిని మర్చిపోలేదనే చెప్పాలి.
Please Read Disclaimer