ప్రియానిక్ జంట బీచ్ ని మరిగించారుగా!

0

న్యూ ఇయర్ వైబ్స్ ఇంకా ముగిసి పోలేదు.. వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవిగో ఈ ఫోటోలు- వీడియో పోస్ట్ లే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. తాజాగా నిక్ జోనాస్ -ప్రియాంక చోప్రా జోనాస్ – స్నేహితుల తో కలిసి బీచ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన లైవ్ ఫోటోలను నిక్ అభిమానులకు షేర్ చేశాడు. ప్రియానిక్ స్నేహితుల బృందంతో బీచ్ సెలబ్రేషన్స్ ని ఏ రేంజులో ఎంజాయ్ చేసారో ఈ ఫోటోలు చెబుతున్నాయి.

“ప్రతిదీ ఆనందమయం.. స్నేహితులకు కృతజ్ఞతలు. మాతో ఉన్న స్నేహితులకు .. దూరంగా ఉన్న స్నేహితులకు ధన్యవాదాలు. కొత్త సంవత్సరం ప్రారంభించే ఉద్వేగం లో ఉన్నాం..“ అంటూ వ్యాఖ్యను నిక్ జోడించారు. అయితే అదంతా సరే కానీ.. జనాల దృష్టి మాత్రం పూర్తిగా నిక్ ఒడిలో కూర్చుని ఉన్న వైఫ్ ప్రియాంక చోప్రా పైనే నిలిచి ఉంది. ఈ వేడుకల్లో నిక్ సాధారణ దుస్తులను ధరించగా.. ప్రియాంక బీచ్ లుక్ డిజైనర్ డ్రెస్ ని ధరించింది. ఇక పీసీని చిక్ పై ముద్దాడేస్తూ నిక్ ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు.

పీసీ కెరీర్ ని చూస్తే.. 2019లో `ది స్కై ఈజ్ పింక్`లో ఫర్హాన్ అక్తర్ సరసన నటించింది. ఈ చిత్రంలో రోహిత్ సరాఫ్ – జైరా వసీమ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చక్కని సమీక్షలు వచ్చాయి. పీసీ నటన కు ప్రశంసలు దక్కాయి. తదుపరి తన చిత్రానికి సంబంధించిన షూటింగు లో పాల్గొనేందుకు పీసీ ఇప్పటికే భారతదేశం లో అడుగు పెట్టిందట.
Please Read Disclaimer