ప్రియాంక `వైట్ డ్రస్` ధర తెలిస్తే షాకే!

0బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో పాగా వేసిన ప్రియాంకా చోప్రా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. క్వాంటికో సిరీస్ తో పాపులర్ అయిన ప్రియాంకా హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాంతోపాటు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో పీసీ పీకల్లోతు ప్రేమలో పడింది. కొద్ది రోజుల క్రితం నిక్ ను ముంబైకు తీసుకువచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేసింది. ఆ సందర్భంగా నిక్ తో చెట్టాపట్టాలేసుకొని ముంబై వీధుల్లో ప్రియాంకా చక్కర్లు కొట్టింది. అసలే ఫ్యాషన్ ఫ్రీక్ అయిన పీసీ….ప్రియుడితో కలిసి బయటకు వెళ్లే సమయంలో ఖరీదైన బ్రాండెడ్ డ్రస్ లతో ఆకట్టుకుంటోంది. తన బర్త్ డే రోజున అక్షరాలా 2 లక్షల ఖరీదైన వైట్ డ్రస్ ను ధరించిర పీసీ …చూపరులను ఆకట్టుకుంది. ఆ డ్రస్ ధర విని నెటిజన్లు షాకయ్యారు.

కొద్ది రోజుల క్రితం ….ప్రియాంకా చోప్రా….రూ. 4లక్షలు విలువైన బ్యాగ్ ధరించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో జూలై 18న తన పుట్టిన రోజు సందర్భంగా వైట్ స్కర్ట్ ధరించి నిక్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే ఆ వైట్ డ్రస్ ధర దాదాపు 2లక్షలని తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు. ‘‘ బాల్మెయిన్ బటన్డ్ మాక్సీ స్కర్ట్’’ – ‘‘వైనస్ వైట్ ములస్’’ ల ధర వరుసగా 1850 – 895 డాలర్లట. రెండూ కలిపి మన కరెన్సీలో దాదాపుగా 186660రూపాయలన్న మాట. అయితే ఇంత కాస్ట్రీ డ్రస్ ధరించిన పీసీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంకా…ఎంత ఖరీదైన బ్రాండ్ లనైనా ధరిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు తనకు వివాహ వ్యవస్థపై నమ్మకముందని తన జీవితంలో ఏదో ఒక దశలో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని ప్రియాంక చెప్పిన సంగతి తెలిసిందే. తాను చాలా రొమాంటిక్ అని….తనను ప్రేమించే వ్యక్తి కోసం బంధాన్ని ఏర్పరుచుకోవడం ఇష్టమని ప్రియాంక తెలిపింది. దీంతో త్వరలోనే నిక్ తో పీసీ ఏడడుగులు నడవబోతోందని పుకార్లు వస్తున్నాయి.