పార్టీల్లో మునిగి అందాన్ని పట్టించుకోని హాటీ

0

2020 పార్టీల్లో సెలబ్రిటీ ప్రపంచం మత్తులో జోగుతూ ఫుల్ గా చిలౌట్ ని ఆస్వాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా హాట్ సెలబ్ కపుల్స్ ప్రత్యేకించి యూత్ కి గోల్స్ ఫిక్స్ చేశారు. టాలీవుడ్ టు బాలీవుడ్.. బాలీవుడ్ టు హాలీవుడ్ ఇదే వరుస. ఇక అమెరికా కోడలు ప్రియాంక చోప్రా తన హబ్బీ నిక్ జోనాస్ తో కలిసి ఏ తీరుగా రచ్చ చేసిందో తెలుసా? చూస్తే షాక్ తింటారు. న్యూఇయర్ సందర్బంగా అదిరిపోయే కలర్ ఫుల్ లొకేషన్స్ లో పీసీ ఎంజాయ్ చేసింది.

ఇక ఈ పార్టీలో పీసీ డిజైనర్ పింక్ డ్రెస్ వీక్షకుల్ని వేడెక్కించింది. ఎలాంటి మేకప్ లేకుండా సహజంగా కనిపిస్తూనే పీసీ సంథింగ్ హాట్ గా కవ్వించింది. అది ప్రత్యేకంగా పార్టీ కోసం డిజైన్ చేసిన లాంగ్ పింక్ గౌన్. అందాల్ని అంతే సుందరంగా ఎలివేట్ చేసింది గౌన్. ఇక ఈ గౌనులో పీసీ అందాల్ని అన్ని కోణాల్లోనూ కెమెరా కళ్లు క్యాచ్ చేశాయి. ఒక చేత్తో వైన్ గ్లాస్ ని గాల్లోకి ఎత్తిన పీసీ చిద్విలాసంగా నవ్వులు చిందిస్తోంది.

అయితే ఈ పార్టీతో పీసీలోని మరో కోణం అడ్డంగా బయటపడింది. ఇలా పార్టీలతో బిజీగా ఉండడం వల్లనో ఏమో.. పీసీ అందంపై శ్రద్ధ పెట్టినట్టు లేదు. ఆ నడుము చుట్టూ కొలెస్టరాల్ ఊహించనంతగా పెరిగింది. వీపు భాగం మందం ఫ్లాటుగా తయారైంది. అలాగే పొట్ట ఉబ్బి కనిపిస్తోంది. ఎంతగా వేడెక్కించే నవ్వులతో కవ్విస్తున్నా.. తెరమాటు గుట్టు మాత్రం బయటపడిపోయిందిలా ఈ ఫోఓలతో. అందంపై ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా పీసీ? అంటూ అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. పార్టీలు ముగించి జిమ్ కి వెళ్లమని సజెస్ట్ చేస్తున్నారు.
Please Read Disclaimer