మ్యాట్రిక్స్-4లో ప్రియాంక చోప్రా జాక్ పాట్

0

హిందీ పరిశ్రమ అగ్ర కథానాయిక.. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టీవీ పరిశ్రమలోనూ పీసీ విరివిగా అవకాశాలు అందుకుంటున్నారు. క్వాంటికో సిరీస్ మొదలు పీసీకి అక్కడ ఛాన్సులకు కొదవే లేదు. ప్రముఖ హాలీవుడ్ దర్శకరచయితలు టీవీ నిర్మాతల భాగస్వామ్యంతో పీసీ సొంతంగా సినీటీవీ నిర్మాణంలోకి ప్రవేశించడం తాజాగా బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

క్వాంటికో.. బేవాచ్ లాంటి చిత్రాలతో ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించింది. అమెరికన్ టాప్ సింగర్.. జుమాంజి 2 హీరో నిక్ జోనాస్ తో ఆమె వివాహం హాలీవుడ్ లో తన స్థాయిని పెంచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజ్ `ది మ్యాట్రిక్స్` నాలుగో సినిమాలోనూ ప్రియాంక చోప్రా ఒక కీలక పాత్రను పోషించడానికి అంగీకరించింది. మ్యాట్రిక్స్ -4 కి ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించాల్సి ఉంది.

వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీను రీవ్స్ – క్యారీ-అన్నే మోస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా ఎలాంటి పాత్ర పోషిస్తుందనే దానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ఇతర ప్రముఖ నటులలో నీల్ పాట్రిక్ హారిస్.. యాహ్యా అబ్దుల్-మతీన్- II .. జెస్సికా హెన్విక్ ఉన్నారు. లానా వాచోవ్ స్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది నెవ్వర్ బిఫోర్ యాక్షన్ ప్యాక్డ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం అని తెలుస్తోంది. 2022 ఏప్రిల్ 1న థియేటర్లలో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. తాజాగా పీసీ యాడింగ్ ఇండియన్ మార్కెట్లోనూ వేడి పెంచనుందని అంచనా వేస్తున్నారు. మహమ్మారి కారణంగా కొంతకాలంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారని తెలుస్తోంది.