ప్రియాంకతో పనే కాదు.. నాలుగో మైనం బొమ్మ!

0

ప్రపంచప్రఖ్యాత మైనపు బొమ్మల మ్యూజియంలో చోటు సాధించడమేమీ ఆషామాషీ విషయం కాదు. భారీ గుర్తింపు కలిగిన సెలబ్రిటీలకే అందులో స్థానం లభిస్తుంది. భారతీయ ప్రముఖుల్లో ఇప్పటికే చాలామంది ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్.. షారూఖ్ ఖాన్.. ఐశ్వర్యా రాయ్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్.. దీపక పదుకొనే… కత్రినా కైఫ్.. మహేష్ బాబు లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలకు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో స్థానం లభించింది. అయితే తాజాగా గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా నాలుగవ మైనపు బొమ్మను లండన్ లో ఆవిష్కరించారు.

ఇప్పటివరకూ న్యూ యార్క్.. సిడ్నీ.. సింగపూర్ లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియమ్స్ లో ప్రియాంక చోప్రా మైనపు బొమ్మలు ఉన్నాయి. తాజాగా లండన్లో ని మేడమ్ టుస్సాడ్స్ లో కూడా ప్రియాంక మైనపు బొమ్మను పెట్టారు. ఈ మైనపు బొమ్మ ప్రియాంక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2017 లో ధరించిన గోల్డెన్ సెక్విన్ డ్రస్ లో ఉంది. ఆ మైనపు బొమ్మను చూస్తే నిజమైన అందాల బొమ్మగా కనిపిస్తోంది. పొరపాటున కూడా ఆ బొమ్మను చూసి బొమ్మ అనుకోరు.. అంత సజీవంగా కనిపిస్తోంది. పైగా యమా హా..టు!

ఏదేమైనా ప్రియాంక చోప్రా తన్న గ్లోబల్ సుందరి ట్యాగ్ ను సరిగ్గా జస్టిఫై చేస్తున్నట్టే. బాలీవుడ్ లో హీరోయిన్ గా తన సత్తా చాటి హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక నిక్ జోనాస్ తో వివాహం తర్వాత సినిమాల సంఖ్య తగ్గించింది. ప్రస్తుతం ‘ది స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా హృతిక్ రోషన్ చిత్రం ‘క్రిష్ 4’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Please Read Disclaimer