అమెరికా కోడలు అనకొండ వేషం ఏమిటో!

0

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏం చేసినా సంచలనమే. పబ్లిక్ లో పెదవి ముద్దులు.. దమ్ము కొట్టడం…విదేశీ టీవీ సిరీస్ లలో రియల్ రొమాన్స్ ఇవన్నీ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇండియా కోడలు కాదు కాబట్టే…ఇలాంటి విషయాల్లో అదుపు లేకుండా వెళ్లిపోతుందన్న విమర్శలు వచ్చాయి. విదేశీ బోయ్ ప్రెండ్ నిక్ ని పెళ్లాడిన తర్వాత పీసీ పాత సంస్కృతిని పాతరేసి పాశ్చాత్య ధోరణిలోకి వెళ్లి పోయిందని తిట్టి పోసారు కొందరైతే. తన వ్యవహారంపై భారతీయ మహిళా సంఘాలు భగ్గుమన్నా పీసీకి చీమకుట్టినట్లు కూడా లేదు. ఎవరి గోల వారిదే…నా దారి నాదే! అన్నట్టుగానే వ్యవరించింది.

పెళ్లికి ముందు ప్రైవసీ విషయంలో ప్రయివేటు వ్యవహారాల్లో పద్దతిగా ఉన్న పీసీ పెళ్లి తర్వాత ఆ పద్దతికి పూర్తిగా విరుద్దంగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. తాజాగా మరోసారి ప్రియాంక చోప్రా డ్రెస్సింగ్ సెన్స్ ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కింది. గత రాత్రి పీసీ భర్త నిక్ తో కలిసి లండన్ వీధుల్లో డిన్నర్ కి వెళ్లింది. ఆ సమయంలో పాశ్చాత్య ఎలివేషన్ కి సంబంధించిన కుగవేరా మిడ్డీ డ్రెస్ ని ధరించింది. ఆ డ్రెస్ లో పీసీ ఎంతో వికృతంగా కనిపిస్తోంది. టాప్ వరకూ ఓకే కానీ బాటమ్ వైపు చూసేందుకు ఎంతో ఇబ్బందికరంగానే అనిపించింది. బాటమ్ లో బ్లాక్ వేర్ లో థైషో హైలైట్ అవ్వడం చర్చకొచ్చింది.

దానిపై అనకొండ చర్మంలా ముఖమల్ మెరుపులు హైలైట్ గా కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి నెటిజనం చెలరేగి పోయారు. ఆ అనకొండ డ్రెస్ ఏమిటో మేడం! లండన్ లో ఉన్నా..విదేశీయుడిని పెళ్లాడినా…భారతీయ ఆడపడుచు అన్న విషయం మర్చిపోకండి అంటూ చురకలు వేస్తున్నారు. ఇలాంటి విమర్శలు..ట్రోల్స్ పీసీకి కొత్తేం కాదు. వాటిని అంతే ధీటుగా తిప్పికొట్టే సమర్ధురాలే. అయితే ఎప్పుడు పడితే అప్పుడు నోరు జారదు. అవసరమనుకుంటేనే కౌంటర్ ఎటాక్ ఇస్తుంటుంది.
Please Read Disclaimer