ప్రియాంక జవల్కర్ కి ఆఫర్ దక్కిందా ?

0

గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన హారర్ థ్రిల్లర్ టాక్సీ వాలాతో పరిచయమైన ప్రియాంక జవల్కర్ తర్వాత మళ్ళీ ఇంకే సినిమాలోనూ కనిపించలేదు. ఓ రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చినా పాత్ర నచ్చని కారణంగా వదిలేసుకుందని అప్పట్లో టాక్ వచ్చింది కానీ తనుగా ఏ విషయం చెప్పలేదు. తాజా అప్ డేట్ ప్రకారం ఓ బడ్జెట్ మూవీకి ప్రియాంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.

దర్శకుడు క్రిష్ దగ్గర సినిమాటోగ్రాఫర్ గా చేసిన జ్ఞాన శేఖర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీయబోయే డెబ్యూ మూవీలో ప్రియాంకానే హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలిసింది. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హీరోను కూడా ఓ వర్ధమాన నటుడిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వినికిడి

అయినా విజయ్ దేవరకొండ లాంటి స్టేచర్ ఉన్న హీరోతో చేశాక ఇలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోవడం అంటే సాహసమే. పెద్ద ఆఫర్స్ ని వదులుకుని ఇప్పుడిలా చిన్న సినిమాకు ఓకే చెప్పిందంటే దాంట్లో అంత ఎగ్జైట్మెంట్ అనిపించిన అంశాలు ఏమున్నాయో మొదలయ్యాక కానీ క్లారిటీ లేదు. హీరో ఫిక్స్ అయ్యాక వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి వచ్చిన హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా జవల్కర్ ఇకనైనా కెరీర్లో స్పీడ్ పెంచి కాస్త ఆఫర్ల మీద దృష్టి పెడితే బెటర్. లేకపోతే ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు.
Please Read Disclaimer