నిక్ పై జోక్స్.. ఫోటోను మార్ఫింగ్ చేసిన పీసీ!

0

సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్ ను ఎదుర్కోవడం ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా సులువు కాదు. ఇక గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రాకు మొదటి నుంచి ట్రోలింగ్ బెడద ఎక్కువే. తాజాగా ప్రియాంక చోప్రా వల్ల భర్త నిక్ జోనాస్ పై సోషల్ మీడియాలో జోకులు మీద జోకులు వేసి నెటిజన్లు పండగ చేసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే జోనాస్ బ్రదర్స్ ఈమధ్య MTV మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో జోనాస్ బ్రదర్స్ కు ‘సకర్’ ఆల్బమ్ కు ఒక అవార్డు లభించింది. దీంతో నిక్ సోదరులు జో తన భార్య సోఫీతోనూ .. కెవిన్ తన భార్య డేనియల్ తోనూ గాఢమైన అధర చుంబనంలో మునిగిపోయారు. అయితే నిక్కుకు లిప్ లాకు చేసే అవకాశం లేకుండా పోయింది… కారణం ప్రియాంక ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో ఇద్దరు సోదరులు అర్జున్ రెడ్డి తరహాలో రెచ్చిపోతుంటే నిక్కు మాత్రం దిగాలుగా దిక్కులు చూస్తూ నిలుచున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం..జనాలు నిక్ పై..ప్రియాంకపై జోకులు పేల్చడం చకచకా జరిగిపోయాయి.

ఇది ప్రియాంక గమనించి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. సేమ్ ఫోటోలో నిక్ బాహుబంధాల్లో ఉన్నట్టుగా తన ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “నేను నీతో ఎప్పుడూ ఉంటాను నిక్. జోనాస్ బ్రదర్స్ కు అభినందనలు. మిమ్మల్ని చూసి నేను గర్విస్తున్నాను @సకర్” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఆ క్యాప్షన్ లోనే కన్నుగీటే ఎమోజి..మరో లవ్ ఎమోజిని జోడించింది. అంటే తను ఫోటో షాప్ తో అల్లరిపని చేసిందనే అర్థం. ఈ ఫోటోకు 2.5 మిలియన్స్ కు పైగా లైక్స్ వచ్చాయి. ఎపిక్ ఫోటో ఎడిట్..హేటర్లకు బెస్ట్ రెస్పాన్స్ అంటూ చాలామంది పీసీని మెచ్చుకున్నారు.
Please Read Disclaimer