బెడ్ పై ఉన్న భర్తతో అలా

0

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. ప్రియుడు నిక్ జోనాస్ ని పెళ్లాడింది మొదలు అతడితో లైఫ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు – వీడియోల్ని ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ప్రస్తుతం సినిమాలతో కంటే భర్తతో కాపురాన్ని ఎంజాయ్ చేసేందుకే ఆసక్తిగా ఉంది.

ఇక పీసీ లైఫ్ సెలబ్రేషన్ పై నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భర్తతో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో చెలరేగినా.. లేదూ యాచ్ పార్టీలో ఓపెన్ టాప్ లో సిగరెట్లు కాల్చినా.. పబ్లిక్ అంతా చూస్తుండగా పెదవి ముద్దులతో చెలరేగిపోయినా.. పీసీ ప్రతి యాక్టివిటీని పబ్లిక్ తెగ తిట్టారు. ఇక ఆయనకు సర్ ప్రైజ్ లు అంటూ పీసీ చేసే ప్రతి పనినీ తనకు సోషల్ మీడియాల్లో షేర్ చేసే అలవాటు ఉంది. కొన్నిటికి పొగడ్తలు వచ్చినా చాలా వాటికి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పీసీ నొచ్చుకుంటూనే ఉంది.

ఇకపోతే తాజాగా ఓ బెడ్ టైమ్ వీడియోని షేర్ చేసి పీసీ మరోసారి సర్ ప్రైజ్ ఇచ్చింది. నిక్ ఎంతో బద్ధకంగా నిద్రిస్తుంటే అతడిని నిద్ర లేపి మరీ సర్ ప్రైజ్ చేసింది. అసలింతకీ ఏమిటా సర్ ప్రైజ్ అన్నది తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే. పీసీ పెళ్లి జరిగి డిసెంబర్ 1కి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నాటి తీపిగుర్తులను స్ఫురణకు తెచ్చే పెళ్లి ఫోటోల్ని ఫ్యాన్స్ కు షేర్ చేసింది. ఇక నిక్ తో సెలబ్రేషన్స్ కి కొంత బ్రేకిచ్చి తిరిగి సినిమాల్లోనూ నటిస్తుందా లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే అమెరికాలో ఓ టీవీ సిరీస్ కి పీసీ సంతకం చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer