జయలలిత బయోపిక్ కి ఆదిలోనే హంసపాదు

0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను తెరకెక్కించడం కోసం పలువురు దర్శకులు పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. ఒకే పరిశ్రమకు చెందిన దర్శకులు అమ్మ కథని ఎవరి యాంగిల్ లో వాళ్లు తీస్తున్నారు. ఏ. ఎల్ విజయ్ తలైవి టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మ పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. ప్రస్తుతం లండన్ లో కంగన తన పాత్రకు సంబంధించి తర్ఫీదు పొందుతోంది. దర్శకురాలు ప్రియదర్శిని `ది ఐరన్ లేడీ` టైటిల్ తో నిత్యా మీనన్ టైటిల్ పాత్రలో తెరకెక్కిస్తున్నారు. అలాగే గౌతమ్ మీనన్ అమ్మ కథను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసాడు.

అటు వెండి తెర..ఇటు డిజిటల్ మాధ్యమాల్లోనూ ఇలా అమ్మ జీవితకథని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో జయలలిత మేనకోడలు దీప జయకుమార్ భగ్గుమన్నారు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు అమ్మ కథను తీయడానికి రెడీ అయ్యారు. అసలు వాళ్లకి అమ్మ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. కథని తప్పు దోవ పట్టించే ఆస్కారం లేకపోలేదని నిప్పులు చెరిగారు. ఆ రెండు సినిమాలు.. వెబ్ సిరీస్ విడుదల కాకూడదని ముందొస్తుగా మద్రాసు హైకోర్టులలో పిటీషన్ వేసారు. దీంతో అమ్మ బయోపిక్ పై సస్పెన్స్ నెలకొంది.

ఏ.ఎల్ విజయ్ బృందం ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు. నిత్యా-ప్రియదర్శిని బృందం కూడా అదే స్టేజ్ లో ఉన్నారు. అయితే సినిమాకు సంబంధించిన అమ్మ ఆహార్యాన్ని పోలిన నిత్యా మీనన్ పోస్టర్లను రిలీజ్ చేసారు. గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్ వివరాలు తెలియాల్సి ఉంది. బయోపిక్ లపై ఇలాంటి వివాదాలు సర్వ సాధారణం. ఇటీవలే `సైరా నరసింహారెడ్డి` బయోపిక్ పైనా కుటుంబ సభ్యులం అంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ ముందు వివాదం తలెత్తడం ఇబ్బంది పెట్టింది. అయితే జయలలిత బయోపిక్ ఇంకా మొదలవ్వకముందే వివాదం మొదలైంది.
Please Read Disclaimer