మగాడి తోడు లేకుండా తల్లైంది!

0

ఆడ – మగ కలిస్తే ఈ సృష్టి మనుగడ.. ఏ ఒక్కరితో మానవ మనుగడను సృష్టించలేం. పిల్లలను కనలేం. తల్లి కావాలనే ఆమె కలను నిజం చేసుకోవడానికి ఒక పురుషుడి కోసం వేచి చూడాలని ఆ మహిళ కోరుకోలేదు. ముంబైకి చెందిన 43 ఏళ్ల చిత్ర నిర్మాత ఆశిమా ఛిబ్బర్ కూడా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో మగాడి తోడు లేకుండా.. టచ్ లేకుండా బిడ్డను కని ఆశ్చర్యపరిచింది. లేటు వయసులో తల్లైంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మేరే డాడ్ కీ మారుతి’ సినిమాను డైరెక్ట్ చేసిన ఆశిమా ఛిబ్బర్ ప్రముఖ దర్శకురాలు. 40 ఏళ్ల వయసులో తల్లి కావాలని తలించింది. 43 ఏళ్ల వయసులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఆశిమా ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా 43 ఏళ్ల వయసులో వీర్యదాతల నుంచి స్పెర్మ్ తీసుకొని తల్లిగా మారింది. పెళ్లి కాకుండానే మగాడితో స్పర్శ లేకుండా తల్లి కావాలని తలంచి డాక్టర్ల సాయంతో బిడ్డను కనింది.

తనకు పుట్టిన బిడ్డకు శివ్ అని పేరు పెట్టింది. ఒంటరి అయిన ఆశిమాకు ఇప్పుడు ఆ బిడ్డే ప్రపంచం. ప్రస్తుతం రెండేళ్ల వయసున్న శివ్ ఆమె లోకం.

ఆశిమా లాంటి ఒంటరి తల్లులు.. సాహసంగా లైంగిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా బిడ్డను కనాలని.. బంధాల్లో స్వేచ్ఛను సంపాదించే హక్కును ఉపయోగించుకున్నారు. పురుషాధిక్య సమాజం విధించిన ఆంక్షలకు కట్టుబడకుండా ఆశిమా తల్లి అయిన తీరు ఇప్పుడు దేశంలో వైరల్ గా మారింది.
Please Read Disclaimer