రూలర్ తలదన్నేలా మరోటి తీస్తాడట!

0

కాకి పిల్ల కాకి కి ముద్దు! అన్న సామెతను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మా సినిమా సూపర్ హిట్టు అని ప్రచారం చేసుకోవడం అనేది ఇటీవలి కాలంలో మరీ కామన్ అయిపోయింది. ఓవైపు డిజాస్టర్ అంటూ ట్రేడ్ లో టాక్ నడుస్తుంటే.. దాంతో సంబంధం లేకుండా.. సంతృప్తికరమైన విజయం సాధించామని.. మరో సినిమాకి సన్నాహాలు చేసేస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదమే అవుతుంది.

ఇదంతా దేని గురించి అంటే.. నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా గురించే. ఓవైపు డిజాస్టర్ టాక్ పై నందమూరి అభిమానుల్లోనే వైరల్ గా సామాజిక డిబేట్ నడుస్తుంటే మా సినిమా సూపర్ హిట్టు అంటున్నారు రూలర్ నిర్మాత సి.కల్యాణ్. ఆయన చెప్పినట్టు అయితే మంచిదే. కానీ ఈ సినిమాకి థియేటర్ల లో ఏమంత సీన్ లేదన్నది ప్రాక్టికల్ గా చూసిన వారు చెబుతున్నారు.

పైగా పరమ రొటీన్ మూస మాస్ సినిమా అన్న టాక్ తెచ్చుకోవడం రూలర్ కి పెద్ద మైనస్ అయ్యింది. ఎంచుకున్న కథాంశం రాంగ్ అని విమర్శలొస్తే .. డిజాస్టర్ అన్న టాక్ నడుస్తుంటే అదేమీ పట్టనట్టు సక్సెస్ మీట్ లో సాంకేతికాంశాలపైకి ఆ నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు. 4కేలో సినిమాని క్వాలిటీగా హై రిజల్యూషన్ తో తీశాం. అందుకే కాపీ చేసుకోవడానికి రూలర్ బావున్నట్టుంది. పైరసీలో చూసేందుకు జనం ఇష్టపడుతున్నారు అన్నట్టుగానే మాట్లాడారు. ఏడు వేల పైరసీ లింకుల్ని తొలగించామని వెల్లడించారు. పనిలో పనిగా జైసింహాని మించి సినిమా తీశారని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ని ఆకాశానికెత్తేశారు సి.కల్యాణ్. ఉన్న తలపోటు చాలదా? అన్నట్టు ఇంకోటి తీయడం న్యాయమా? పైగా పైరసీపై ఉక్కుపాదం మోపడం మాని చోద్యం చూస్తూ.. ఇలా అంటారా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Please Read Disclaimer