పెళ్లిచూపులు నిర్మాత వారసుడు డెబ్యూ

0

హీరోల నటవారసులు హీరోలు అవ్వడం రొటీనే. దర్శకనిర్మాతల వారసులు హీరోలుగా రంగ ప్రవేశం చేసి నిలదొక్కుకోవడమే సంథింగ్. ఆ కోవలో పలువురు వచ్చి సక్సెసయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి వారసుడు శివ కందుకూరి కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. `చూసి చూడంగానే` అనేది సినిమా టైటిల్. శేష సింధూరావు ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం అవుతుండగా.. తెలుగమ్మాయి వర్ష బొల్లమ్మ ఇదే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేయనున్నారు.

ఇదో రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఇందులో డెబ్యూ హీరో శివ పెళ్లిళ్ల ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో శివ కందుకూరి ఎంతో సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ కాబట్టి తన కంటికి చిక్కిన అందాన్ని కెమెరాలో బంధించేస్తున్న ఫోజుని రిలీజ్ చేశారు. `శివ కందుకూరి పరిచయం` అంటూ పోస్టర్ పైనే హైలైట్ చేశారు.

దిల్ రాజు నిర్మించిన `బొమ్మరిల్లు` స్ఫూర్తితో అలాంటి సినిమా తీయాలని సంకల్పించి ఈ రంగంలోకి వచ్చానని చెబుతుంటారు రాజ్ కందుకూరి. మంచి సినిమాలు తీయాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. పెళ్లి చూపులు లాంటి జాతీయ అవార్డ్ సినిమాతో తన కల నెరవేరింది. ప్రస్తుతం కందుకూరి వరుసగా సినిమాల్ని నిర్మిస్తున్నారు. వీటన్నిటినీ మించి తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేసేందుకు చాలానే తపిస్తున్నారు. `పెళ్లి చూపులు` రిలీజ్ కి సాయపడిన అగ్రనిర్మాత కం పంపిణీదారుడు డి.సురేష్ బాబు అండదండలు తనకు ఉన్నాయి. డెబ్యూ హీరో శివ కందుకూరికి అంత పెద్ద నిర్మాత ఎగ్జిబిటర్ కం డిస్ట్రిబ్యూటర్ బ్యాకప్ ఉంది అంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్నట్టే. థియేటర్ల పరమైన సమస్యా ఉండదు కాబట్టి డెబ్యూ సాఫీగానే సాగుతుంది. అయితే కంటెంట్ పరంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. కథ- కంటెంట్ తో మెప్పిస్తే ఇక్కడ రాణించడం కష్టమేమీ కాదు. పైగా ప్రొడ్యూసర్ డాడ్ ప్లానింగ్ తనకు పెద్ద ప్లస్ కానుంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు కాబట్టి శివలో మ్యాటర్ ఎంతో చెప్పాలంటే అప్పటివరకూ వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer