షాక్: జార్జిరెడ్డితో తమ్మారెడ్డి స్నేహం

0

ప్రస్తుతం జార్జిరెడ్డి పేరు టాలీవుడ్ లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉస్మానియా రెబల్ స్టూడెంట్ అయిన ఆయన హత్యోదంతం గురించి ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఆయన పేరుపైనే బయోపిక్ అదే టైటిల్ తో తెరపైకి రావడంతోనే జార్జిరెడ్డి పేరు ప్రజలకు మరింత చేరువైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు సినిమాను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.

ముందుగా జార్జిరెడ్డి కథలో పవన్ కల్యాణ్ నటించాలనుకోవడం.. అటుపై మెగా బ్రదర్ నాగబాబు ట్రైలర్ చూసి మెచ్చుకోవడంతో ఆడియన్స్ లో చర్చ సాగింది. కొన్ని గంటలు క్రితమే యూనిట్ మెగాస్టార్ ను కలిసి ట్రైలర్ చూపించింది. ఆయన చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఉస్మానియా రెబల్ జార్జిరెడ్డికి నేను స్నేహితుడిని అంటూ.. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారన్న వార్త సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. జార్జిరెడ్డి గురించి ఓ ఇంటర్వూలో తమ్మారెడ్డి స్పందిస్తూ అలా అనడంతోనే ఈవిషయం వెలుగులోకి వచ్చింది. జార్జిరెడ్డిని తన కారులో ఉస్మానియా యూనివర్శీటి లైబ్రెరీ వద్ద డ్రాప్ చేసి వచ్చిన రెండు గంటలు తర్వాత అతని మరణ వార్త వినాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే జార్జిరెడ్డికి శత్రువులు ఎక్కువగానే ఉండేవారని..తనని మట్టుబెట్టే వరకూ నిద్రపోనంత కక్షను పెంచుకున్నారని కూడా ఆయన అన్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే మంచిదే. జార్జిరెడ్డి లాంటి విప్లవకారుడికి తమ్మారెడ్డి స్నేహితుడు అన్నది కొంత డిబేట్ కి తెర తీస్తోంది.
Please Read Disclaimer