రోడ్డు ప్రమాదంలో నిర్మాత మృతి

0

సినీ ప్రముఖుల రోడ్ ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఏడాది కాలంగా ఈ ప్రమాదాలు మరీ ఎక్కువయ్యాయి. ఇటీవల పలువురు హీరోలు.. నటులు రోడ్ ప్రమాదాలకు గురయ్యారు. ఇక ఇదే వరుసలో మరో యాక్సిడెంట్. ఈసారి వెటరన్ నిర్మాత ఒకరు రోడ్ ప్రమాదానికి గురై మరణించారని తెలుస్తోంది.

రణధీరుడు- మళ్లీ ఇంకోసారి- రౌడీ చిత్రాలను నిర్మించిన తోట రామయ్య రోడ్ టెర్రర్ లో కన్ను మూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో సికింద్రాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు భార్య వసుంధర – కుమారుడు రాహుల్ బాబు – కుమార్తె నీలిమ ఉన్నారు. సోమవారం బన్సీలాల్ పేటలోని స్మసాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

రామయ్య మృతి పట్ల టాలీవుడ్ లో ఆయన సన్నిహితులు.. స్నేహితులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో సినిమా వాళ్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవ్వడం అందోళ కలిగిస్తోంది. ఇప్పటికే నటుడు రాజశేఖర్ రెండుసార్లు కారు యాక్సిడెంట్ లో తృటిలో తప్పించుకున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ .. జబర్ధస్త్ నటుడు యాక్సిడెంట్ లో తృటిలో తప్పించుకున్నారు. తాజాగా రామయ్య రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూయడం ఆందోళనను కలిగించింది.
Please Read Disclaimer