చిత్రలహరిపై డబుల్ హ్యాట్రిక్ భారం

0

సుప్రీమ్ హీరోగా ఐదు సినిమాలు పూర్తి కాకుండానే మంచి మార్కెట్ తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండానే వరసగా ఆరు డిజాస్టర్లు అందుకుని ఇమేజ్ పరంగా బాగా డ్యామేజ్ ఎదురుకున్నాడు. అందుకే ఇప్పుడు రాబోయే చిత్రలహరి మీద మాములు ఆశలు పెట్టుకోలేదు. కాని డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ తాలూకు గాయాలు మానాలి అంటే చిత్రలహరి మాములు హిట్ అయితే సరిపోదు. బ్లాక్ బస్టర్ రేంజ్ కావాలి.

అయితే చిత్రలహరి మీద ఇతర అంశాలు కూడా ప్రెజర్ పెంచుతున్నాయి. హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శన్ నివేత పేతురేజ్ ఇద్దరికీ ఇక్కడ పెద్ద గుర్తింపు లేదు. చేసిన ఒకటి ఆరా సినిమాలూ ఆడలేదు. మరోవైపు దర్శకుడు తిరుమల కిషోర్ గత చిత్రం ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు

అటు చూస్తే మైత్రి సంస్థకు రంగస్థలం తర్వాత ఏమంత అచ్చి రావడం లేదు. సవ్యసాచితో పాటు అమర్ అక్బర్ ఆంటోనీ బాగా దెబ్బ కొట్టాయి. సగం పెట్టుబడి కూడా బయ్యర్లకు వెనక్కు రాలేదు. అందుకే చిత్రలహరి విజయం వాళ్లకూ చాలా కీలకం. దేవిశ్రీప్రసాద్ లాస్ట్ ఆల్బమ్ వినయ విధేయ రామ తీవ్ర విమర్శలు అందుకుంది.

ఈ నేపథ్యంలో చిత్రలహరి మీద ఇందరి కెరీర్లు ఆధారపడి ఉన్నాయి. వచ్చే నెల 12 విడుదల ఫిక్స్ చేశారు. ఎన్నికలు అయ్యాక మరుసటి రోజు కాబట్టి జనం సినిమా మూడ్ లోకి వచ్చేసి ఉంటారు. అంచనాలు అందుకుంటే చాలు సీజన్ ని బాగా వాడుకోవచ్చు. ఇన్ని నెగటివ్ వైబ్రేషన్స్ మధ్య చిత్రలహరి నెగ్గడం పెద్ద ఛాలెంజే