ఆ నిర్మాతలను మెగా హీరో గట్టెంకించగలడా..?

0

ఒకప్పుడు భారీ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూర్లుగా వెలుగొందిన నిర్మాతలు జె. భగవాన్ మరియు జె. పుల్లరావు. తర్వాత వరుసగా పరాజయాలు వెక్కిరించడంతో రేసులో వెనకబడిపోయారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నిర్మించినా చెప్పుకోదగ్గ హిట్ మాత్రం అందుకోలేకపోయారు. వీరు చాలా గ్యాప్ తీసుకొని ఈ మధ్యే ఒక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సాయిధరమ్ తేజ్ – నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెసెంటుగా పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్.యన్ ప్రసాద్ నిర్మిస్తుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ పూర్తవకపోవడం కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈ ఎఫెక్ట్ జె. పుల్లారావు భగవాన్ నిర్మిస్తున్న చిత్రం మీద పడనుంది. వివరాల్లోకి వెళ్తే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈ షూటింగులో పాల్గొంటానని కథ ఇంకోసారి విని షూటింగ్ చేస్తానని సాయి ధరమ్ తేజ్ నిర్మాతలకు చెప్పాడట. అయితే కరోనా ప్రభావం వల్ల సోలో బ్రతుకే సో బెటర్ ఆగిపోయింది. అది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి మళ్ళీ కథ విని మా సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయాలని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారంట. అందులోనూ గీతా ఆర్ట్స్ వాళ్ళు సాయి ధరమ్ తేజ్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారంట. ఎన్నో ఇబ్బందులు వ్యవ ప్రయాసలు పడి సినిమా స్టార్ట్ చేస్తే ఈ కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ ఆగిపోయి తిరిగి మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుద్ధో తెలియని పరిస్థితుల్లో పడ్డామని నిర్మాతలు తమ గోడు వెలిబుచ్చారంట. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు భగవాన్ పుల్లారావులకు సినీ కష్టాలు తప్పేలా లేవని అనుకుంటున్నారట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-