నిర్మాతలను గడగడలాడిస్తున్న స్టార్ హీరో

0

ఆయన ఓ పెద్ద స్టార్ హీరో. మధ్యలో రాజకీయాలపై దృష్టి సారించి సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన రీ-ఎంట్రీ ఇస్తున్నారు. హీరోగా ఆయనకు క్రేజ్ ఉండడంతో నిర్మాతలు దర్శకులు ఆయన కోసం క్యూ కడుతున్నారు. ఆయన మాత్రం రెమ్యూనరేషన్ ప్రధానం మిగతా అంతా తర్వాత అన్నట్టుగా వ్య్వహరిస్తున్నారట.

ఆయన డేట్స్ కావాలంటే యాభై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సమర్పించుకోవాలట. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఉండే మార్కెట్ కు ఆ పారితోషికం చాలా ఎక్కువ. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు కదా.. కాల్ షీట్స్ అయినా సినిమాకు తగినన్ని ఇస్తాడా అంటే అదీ లేదు. వీలైనంత తక్కువ సమయం మాత్రమే కేటాయిస్తాడు. ఈ స్టార్ హీరోను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగిన దర్శకులు చాలా తక్కువమంది. దీంతో ఈ స్టార్ హీరోతో సినిమాలు పెట్టుకున్న నిర్మాతలు అందోళనలో ఉన్నారట. హీరోకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాలను త్వరగా చుట్టేయడం వల్ల గత సినిమాల డిజాస్టర్ ఫలితాలు పునరావృతం అవుతాయేమోనని టెన్షన్ గా ఉన్నారట. తాము పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే ఆలోచనలతో నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట.

ఇదిలా ఉంటే ఈ హీరోగారు నటిస్తున్న సినిమా గురించి మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదో షూటింగ్ కు వచ్చామా.. వెళ్ళామా అనే రేంజ్ లో ఆయన ప్రవర్తిస్తున్నాడట. నటన పట్ల హీరోగారికి ఆసక్తి కనిపించడం లేదని అంటున్నారు. ఈ వ్యవహారం సినిమా అవుట్ పుట్ పై ప్రభావం చూపించే అవకాశం కొట్టిపారేయలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer