పరశురామ్ కి నిర్మాతల వార్నింగ్.. డెడ్ లైన్!!

0

మిడ్ రేంజ్ హీరోలతో పరిమిత బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు పరశురామ్. గీతగోవిందం బ్లాక్ బస్టర్ విజయం సాధించాక వెంటనే సినిమా ప్రారంభిస్తాడనే భావించారు. వరుస గా ఇద్దరు స్టార్లు అతడిని లాక్ చేసేందుకు ప్రయత్నించారు. సూపర్ స్టార్ మహేష్ .. నాగ చైతన్య పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమా నిర్మించడానికి ఒప్పందం చేసుకోగా… .చైతన్య తో 14 రీల్స్ ప్లస్ సంస్థ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే మహేష్ స్క్రిప్టును డైలమా లో ఉంచడం తో పరశురామ్ .. అక్కినేని హీరో వైపు మొగ్గు చూపాడని సినిమా మొదలెట్టేస్తున్నారని ప్రచారమైంది. అనంతరం రకరకాల సన్నివేశాలు మెలో డ్రామా తెలిసిందే.

అనూహ్యంగా మహేష్ 27వ సినిమా రేసు నుంచి వంశీ పైడిపల్లి ఎగ్జిట్ అవ్వడంతో అతని స్థానంలో పరశురామ్ ని తీసుకొచ్చారు. మహేష్ ముందుగానే తన సినిమానే డైరెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చాడు. దీంతో పరశురాం డైలమాలో పడాల్సిన సన్నివేశం ఎదురైంది. సూపర్ స్టార్ ని కాదని నాగచైతన్యతో ముందుకు వెళ్లాలా? అలా అంటే మహేష్ తో వచ్చే ఇబ్బందులు గురించి ఆలోచనలో పడి ఎటూ తేల్చుకో లేకపోయాడట. చివరి గా మహేష్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలన్న పంతంతో స్రిప్ట్ పై పని మొదలు పెట్టేశాడని `తుపాకి` ఇది వరకూ వెల్లడించింది.

అయితే చైతన్య సినిమా విషయంలో చైతూకి కానీ.. 14 రీల్స్ ప్లస్ వాళ్లకు కానీ పరశురామ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న గుసగుసా వేడెక్కిస్తోంది. శేఖర్ కమ్ములా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చైతూ పరశురామ్ కోసం రెడీ అవుతున్నాడట. దీంతో 14 రీల్స్ ప్లస్ పరశురామ్ కోసం వేచి చూస్తోంది. అతడిని డైలమా నుంచి బయటపడమని సదరు సంస్థ అల్టిమేటమ్ జారీ చేసిందట. ఇచ్చిన ఆఫర్ సద్వినియోగం చేసుకుని సినిమా చేస్తావా.. లేదా? త్వరగా తేల్చుకో!! అనేంత వరకూ విషయం వెళ్లిందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ముందుగా మహష్ తోనా? నాగ చైతన్య తో చేస్తావా? ఏదో విషయం క్లియర్ గా చెప్పేమంటూ తుది ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

అయితే 14 రీల్స్ ఇలా రియాక్ట్ అవ్వడానికి ఓ బలమైన కారణం కూడా వినిపిస్తోంది. పరుశురాం సైలెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ కు షిప్ట్ అయి మహష్ కోసం ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అందువల్లే 14 రీల్స్ చివరిగా సంగతేంటో తేల్చేయమంటూ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చిందట. మరి ఇలాంటి కన్ఫ్యూజన్ నడుమ పరశురాం తను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అవతలివారిని కన్విన్స్ చేస్తాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-