అల మ్యూజికల్ కాన్సెర్ట్ ప్రోమో

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. అల్లు అరవింద్- ఎస్. రాధాకృష్ణ సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత బన్నీ- త్రివిక్రమ్ల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. తమన్ అందించిన గీతాలు సోషల్ మీడియా తో పాటు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను జనవరి 6 సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి విచ్చేస్తానని బన్నికి ప్రామిస్ చేశారని ప్రచారమైంది. తాజాగా అల వైకుంఠపురములో మ్యూజిక్ కాన్సెర్ట్ ప్రోమోని చిత్రబృందం రిలీజ్ చేసింది.
Please Read Disclaimer