కోలివుడ్ లో వ్యభిచారం గుట్టురట్టు: నటీమణులతో చీకటి వ్యాపారం

0

ప్రస్తుతం లాక్ డౌన్ వలన సినీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. పరిశ్రమ అంటే అందమైన నటీమణులు ఉంటారు. హీరోయిన్స్తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అందంగా ఉంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ వలన వారు ఉపాధి కోల్పోయారు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు – సంపన్నులు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ వారిపై వారి కన్ను పడింది. దీంతో తమ డబ్బు – పలుకుబడితో కలిపి వారిని తమ ఎస్టేట్ లు -గెస్ట్ హౌస్ లు – ఫామ్ హౌస్ లకు తెప్పించుకుని వ్యభిచారం నడిపిస్తున్నారు. ఈ విధంగా తమిళ సినీ పరిశ్రమలో చీకటి వ్యాపారం లాక్ డౌన్ సమయంలో విస్తృతంగా సాగుతోంది. ఇది ఒక్కసారి బహిర్గతం అవడంతో కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో సంపన్నులు – బడా వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం.సినిమా – వినోద కార్యక్రమాల షూటింగ్ లు రద్దయ్యాయి. పర్యాటక కేంద్రాలు – నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోని స్టార్ హోటల్స్ – రిసార్టులు – విలాసవంతమైన గెస్ట్ హౌస్ లు ఖాళీగా ఉన్నాయి. దీంతో వ్యభిచార ముఠా ఇదే అదును అని చూసింది. కోలీవుడ్ అమ్మాయిలు – ఆంటీలు – వివాహిత మహిళలను హైటెక్ వ్యభిచార దందాకు తెరలేపారు. కామంతో ఉన్న శ్రీమంతులు వారి పిల్లలు – వ్యాపారవేత్తలు – సంపన్నులను వల వేసి ముఠా ఉసిగొల్పింది. దీంతో వారు రెచ్చిపోయి వారితో రహాస్యంగా గడిపేందుకు ముందుకు వచ్చారు. షూటింగ్ లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు అమ్మాయిలు – వివాహిత మహిళలను ఈ వ్యభిచార ముఠా ఆశలు రేపి బుట్టలో వేసుకున్నారు. వారిని పుదుచ్చేరితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లోని విలాసవంతమైన రిసార్టులు – మసాజ్ సెంటర్లు – స్పా – స్టార్ హోటల్స్ లో వ్యాపారం మొదలుపెట్టారు.రేటు – సమయం – స్థలం అన్ని ఫిక్స్ చేసి ఇరువురిని కలపడానికి ముఠా పక్కా ప్లాన్ తో రెడీ చేసింది. పుదుచ్చేరి పక్కనే విల్లుపురం జిల్లాను అడ్డగా చేసుకుని వ్యాపారం షురూ చేశారు. చెన్నైలో నివాసం ఉంటున్న కొందరు కోలీవుడ్ సహాయ నటీమణులను విల్లుపురం రప్పించుకుని స్పా – విలాసవంతమైన మసాజ్ సెంటర్లు – రిసార్టులు -హోటల్స్ – గెస్ట్ హౌస్ ల్లో బస ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలను రప్పించారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరిలో పేరుపొందిన వ్యాపారవేత్త చంద్రూజీ చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు కోలీవుడ్ నటీమణులను బుక్ చేసుకున్నాడు. మూడు అంతస్తుల విలాసవంతమైన సొంత గెస్ట్ హౌస్ లో రెచ్చిపోతుండగా పోలీసులు ప్రవేశించారు. అర్ధరాత్రి మసాజ్ సెంటర్లు – స్పా కేంద్రాలు – స్టార్ హోటల్స్ – గెస్ట్ హౌస్ ల మీద దాడులు చేయడంతో వ్యాపారవేత్త చంద్రూజీతో పాటు ఇద్దరు కోలీవుడ్ నటీమణులు పట్టుబట్టారు.

మసాజ్ సెంటర్ లో పని ఇప్పిస్తామని నమ్మించి తమను తీసుకువచ్చి భోజనం కూడా పెట్టకుండా వ్యభిచారం చేయిస్తున్నారని ఆ అమ్మాయిలు ఆరోపించారు. ఒకేసారి ఇద్దరు కోలీవుడ్ నటీమణులు పట్టుబడడంతో తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రూజీతో పాటు ఆయన స్నేహితుడు విజయ్ కుమార్ – గెస్ట్ హౌస్ సెక్యూరిటీ గార్డు అనిల్ జోసెఫ్ లను అరెస్టు చేసినట్లు పోలీసు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు? గతంలో ఇలాంటివి చేపట్టారా? వారిచేతిలో ఇంకా ఎంతమంది బంధీ ఉన్నారో ఆరా తీస్తున్నారు. ఈ వార్తతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమా షూటింగ్ లు లేక ఇలాంటి పరిస్థితి దాపురించింది.
Please Read Disclaimer