బిగ్ బాస్ వివాదం..సల్మాన్ ఇల్లు ముట్టడి!

0

ఏదో ఒక వివాదం లేకపోతే బిగ్ బాస్ కాన్సెప్టులు ఎవరు చూస్తారు? ఏవో సిల్లీ గేమ్స్ ఆడించేస్తూ అన్ని గంటల పాటు ఈ రియాలిటీ షోకే అంకితమవ్వమని చెప్పేంత సాహసం చేస్తారా? ఏదో ఇంకేదో స్పైసీ జూసెస్ ని ఆస్వాధించాలని ఆరాటపడే ఆడియెన్ మహాప్రభువుల్ని సంతుష్టుల్ని చేసేందుకు ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఏది? అంటే.. సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో కనిపిస్తోంది.

అది ఏమిటి అంటే.. బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్ అన్నదే ఈ థీమ్. దీని ప్రకారం అమ్మాయి- అబ్బాయి ఒకే బెడ్ పై పడుకుని స్నేహితుల్లా అంతకుమించి కలిసిపోవచ్చు. ఇలాంటిది ఏదో ఒకటి లేకపోతే ఇంకేం ఉంటుంది? అని అందరికీ అనిపిస్తోందా? అయితే ఈ రసరమ్య కలాపాల వేదికగా మారిన బిగ్ బాస్ -హిందీ సీజన్ 13 ఆద్యంతం వివాదాల హోరు పీక్స్ కి చేరబోతోంది.

ఈ దెబ్బకు సల్మాన్ ఇంటి ముందు ఏకంగా ధర్నాలు – రాస్తారోకోలు అంటూ కర్ణిసేనలు.. సామాజిక సంఘాలు బరిలో దిగాయి. తొలిగా సల్మాన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రాజకీయ నాయకులు కూడా.. ఈ వివాదంపై మద్దతు పలుకుతుండడంతో హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ వేడెక్కిస్తోంది. పిచ్చి పరాకాష్టకు చేరుతున్న బిగ్ బాస్ భారతీయ సంప్రదాయాలను భగ్నం చేస్తుందని వీరంతా ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్రంగా మండి పడుతున్నారు. సల్మాన్ ఇంటి పరిసరాల్లో ఆందోళనలు ఉద్రిక్తతం అవ్వడంతో పదిమందిని అరెస్ట్ చేశారు. మరి ఈ నిర్ణయంపై బిగ్ బాస్ వెనక్కి తగ్గుతాడా లేదా అన్నది చూడాలి. ఇలాంటి షోకి హోస్టింగ్ చేస్తున్నందుకు సల్మాన్ గిల్టీ ఫీలవ్వడం లేదా? అన్నది చూడాలి. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 సైతం కాస్టింగ్ కౌచ్ వివాదంతో రచ్చయిన సంగతి తెలిసిందే. పోలీస్ కేసులు అదీ ఇదీ అంటూ నానా రచ్చ చేశారు. కమిట్ మెంట్ లేనిదే ఇక్కడ ఛాన్సులివ్వరని తెలుగు బిగ్ బాస్ పై ఫిర్యాదు చేశారు. అయితే దీనిని అందరూ లైట్ తీస్కున్నారు. మరోవైపు అటు తమిళ బిగ్ బాస్ రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. వివాదాలతో వేడెక్కిస్తోంది.
Please Read Disclaimer