భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

పోకిరి సినిమాలో మాదిరి రేప్ చేసి వదిలారన్న ప్రముఖ నటుడు

0

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన ఇటీవల పెను వివాదంలో చిక్కుకొని.. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీరిక లేని దశ నుంచి.. రాజకీయాల కారణంగా ఇప్పుడు అవకాశాల్లేని పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. ఇలాంటివేళ.. ఆయన ఒక టీవీ చానల్ కు ప్రత్యేకం ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్వీబీసీ వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారన్న పృథ్వీరాజ్.. పోకిరి సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చించేసి ఇక నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారని.. అలాగే తన మీద కూడా అభాండం వేసి వదిలేశారని వాపోయారు. తానెలాంటి తప్పు చేయలేదని.. ఇందులో తనను ఇరికించిన వారి సంగతి శ్రీ వేంకటేశ్వరస్వామే దండిస్తారన్నారు.

తనను ఇబ్బంది పెట్టిన వారెవరూ ఇప్పుడు బతికి లేరని.. తనను ఇరికించిన వారంతా నాశనమైపోతారన్నారు. తనపై కుట్ర మొత్తం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే చేసినట్లు గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎంతలా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం పార్టీని విడిచిపెట్టేది లేదన్నారు. తప్పు చేయకున్నా తాను చానల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయటానికి కారణం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిగా పేర్కొన్నారు.

తనను సీఎం జగన్ రాజీనామా చేయాలని కోరలేదని.. సుబ్బారెడ్డి కోరటం తో తాను పదవికి రాజీనామా చేశానని చెప్పారు. మొత్తంగా తనను ఈ ఎపిసోడ్ లో చెప్పుతో కొట్టి బయటకు తోసేశారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి చెందిన సినీ ప్రముఖులు పలువురు తనను విమర్శించిన వైనాన్ని ప్రస్తావించిన ఆయన బోరుమన్నారు. ఎస్వీబీసీ ఎపిసోడ్ కు రెండు రోజుల ముందే ఒక చానల్ సీఈవో తనను బెదిరించారని.. నీ సంగతి చూస్తా చెత్త నా కొ.. అంటూ దూషించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. తనను అందరూ విజయసాయి రెడ్డి మనిషినంటూ ప్రచారం చేసేవారన్నారు. ఇదే విషయాన్ని ఆయన వద్దకు తీసుకెళితే.. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండాలని సూచించినట్లు చెప్పారు. మరింతా చేసి.. విజయసాయి సైలెంట్ గా ఉండమంటే.. ఇలా ప్రత్యేక ఇంటర్వ్యూ లు ఇస్తే ఇబ్బంది ఉండదా? అన్న ప్రశ్న పృథ్వీరాజ్ కు ఎందుకు తట్టలేదంటారు?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-