చిరు అండ లేకుంటే సూసైడ్ చేసుకునేవాడట

0

ఓపెన్ గా ఉండటం.. కుండ బద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం.. పెద్దగా వ్యూహాలేమీ లేకుండా వ్యవహరించటం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కొందరు ప్రముఖల తీరు విచిత్రంగా ఉంటుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే వారికి ఊహించని దెబ్బలు పడుతుంటాయి. ఆ కోవకే వస్తారు సినీ రంగ ప్రముఖుడు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని విపరీతంగా అభిమానించే ఆయనకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది.

ఎస్వీబీసీ చానల్ ఛైర్మన్ గా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయం పలువురికి షాకింగ్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడేవారో.. అదే రీతిలో మాట్లాడిన ఆయన అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఒక మహిళా ఉద్యోగితో రాసలీలల ఫోన్ కాల్ బయటకు వచ్చి.. ఆయన పదవి ఊడేలా చేసింది. అయితే.. ఆ ఎపిసోడ్ లో తన తప్పు లేదని.. ఆ ఫోన్ కాల్ ఫేక్ అని చెబుతున్నారు పృథ్వీ. మిమిక్రీ చేసి తనను ఇరికించినట్లుగా వ్యాఖ్యానించారు.

మెగాస్టార్ చిరంజీవి కానీ లేకుంటే తానీ పాటికి ఆత్మహత్య చేసుకునేవాడినంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీబీసీ వివాదం తర్వాత మానసికంగా ఇబ్బంది పడుతున్న వేళ.. చిరు అండగా నిలిచారన్నారు. ఈ వివాదం తర్వాత తనకు వేషాలు ఇచ్చి.. ఎంకరేజ్ చేయాలని చెప్పింది చిరు ఒక్కరే అన్నారు. ఆయన కానీ లేకుంటే తానీ పాటికి సూసైడ్ చేసుకునేవాడినని చెప్పారు. తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పడువి సంచలనంగా మారాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-