PSPK 27.. పవన్ రాబిన్ హుడ్ లుక్!

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకదాని వెంట ఒకటిగా వరుసగా సినిమాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. పునరారంగేట్రం పింక్ రీమేక్ తో మొదలు పెట్టాడు. వకీల్ సాబ్ అనే టైటిల్ ని ఇప్పటికే ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. లాయర్ సాబ్ స్థానంలో వకీల్ సాబ్ ఫైనల్ అని చెబుతున్నారు. ఇదిలా ఉండగానే PSPK 27 సినిమాని పవన్ ఇప్పటికే ప్రారంభించేశారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన పవన్ లుక్ విషయమై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. పవన్ నటిస్తున్న 27వ సినిమా లుక్ ఇదే అంటూ ఇంతకుముందు గడ్డంతో ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే వాస్తవానికి పవన్ ప్రస్తుతం గడ్డంతో లేరు. దానిని ఎప్పుడో ట్రిమ్ చేసేశారు. క్రిష్ తో మూవీలో ఆయన పండగల సాయన్న గా నటిస్తున్నారు. సాయన్నకు తెలంగాణ రాబిన్ హుడ్ అన్న ఇమేజ్ ఉంది. ధనికుల్ని కొట్టి పేదలకు పంచేవాడిగా పవన్ ఈ సినిమాలో కనిపిస్తారని.. రెబల్ వారియర్ గా అతడి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

తాజాగా పవన్ లుక్ కి సంబంధించిన స్కెచ్ ఒకటి లీకైంది. ఈస్కెచ్ లో గిరజాల జుట్టు.. తలపాగతో సాయన్న వేషం అదిరిపోయింది. చేతికి కడియం ధరించి కోరమీసం మెలి తిప్పేస్తూ శత్రువుకు సవాల్ విసురుతున్నట్టే కనిపిస్తోంది. నాటి రెబల్స్ గన్స్ ని చేతబట్టి.. మొలలో కత్తి దోపి.. ఉగ్రులై ఆంగ్లేయులకు ఎలా ఎదురెళ్లేవారో ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. అప్పట్లో బంధిపోట్లుగా రెబల్స్ ని పిలిచేవారు ఆంగ్లేయులు. సరిగ్గా ఈ రూపం అలానే ఉంది. ఇప్పటికే గడ్డం తొలగించిన లుక్ తో క్రిష్ సినిమా కోసం పవన్ రెడీ అయ్యారు కాబట్టి అతడి లుక్ డిజైన్ ఒరిజినల్ గా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. పవన్ కొత్త లుక్ పై ఇప్పటికే తుపాకి లో వెల్లడించాం. ఇక గడ్డంతో సీన్స్ తీస్తున్నారు అన్నది రాంగ్. సాయన్న తాజా లుక్ ప్రకారమే పవన్ గెటప్ ని ఛేంజ్ చేసి ఉంటారని అర్థమవుతోంది. పవర్ స్టార్ తన కెరీర్ లో మునుపెన్నడూ ట్రై చేయని కొత్త గెటప్ ని ప్రయత్నిస్తున్నారు. పాన్ఇండియా కేటగిరీ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? కేవలం తెలుగు ఆడియెన్ వరకే పరిమితం చేస్తారా? అన్నది క్రిష్ స్వయంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఇక పవన్ కి ఉన్న అశేష అభిమానగణం దృష్ట్యా ఈ కొత్త లుక్ ఎలా ఉండబోతోందో చూడాలన్న ఆత్రం పెరుగుతోంది.




Please Read Disclaimer