సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

పవన్ 27 : క్రిష్ ఎందుకింత కన్ఫ్యూజన్?

0

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగించకుండానే క్రిష్ దర్శకత్వంలో తన 27 చిత్రాన్ని మొదలు పెట్టాడు. పవన్ లేకుండానే క్రిష్ ఆ సినిమాకు సంబంధించిన షూట్ మొదలు పెట్టాడు. ముఖ్య నటీనటులపై చిత్రీకరణ చేస్తున్న క్రిష్ ఇదే సమయంలో హీరోయిన్ ఎంపిక విషయమై కూడా శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది. రాబిన్ హుడ్ తరహా కథ అవ్వడంతో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. తనకున్న బాలీవుడ్ క్రేజ్ తో అక్కడ మంచి బిజినెస్ చేయవచ్చు అనే ఉద్దేశ్యం తో క్రిష్ హీరోయిన్ విషయం లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

బాలీవుడ్ హీరోయిన్ ను పవన్ కు జోడీగా నటింపజేయడం వల్ల అక్కడ మరింత బిజినెస్ సాధించడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించవచ్చు అనేది క్రిష్ ప్లాన్ గా తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కాని పవన్ కళ్యాణ్ కు జోడీగా అంటూ ఇప్పటి వరకు అర డజను బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వార్తల్లోకి వచ్చాయి. ప్రజ్ఞ జైస్వాల్.. కియారా అద్వానీ.. వాణీ కపూర్.. దిశా పటానీలతో పాటు ఇప్పుడు జాక్విలిన్ ఫెర్నాండెస్ పేరు మీడియా లో వస్తుంది.

క్రిష్ గతంలో ఏ సినిమా చేసినా కూడా హీరోయిన్ విషయంలో మరీ ఇంతగా చర్చ జరగలేదు. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని ఎందుకు ఇంతగా దర్శకుడు క్రిష్ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది. పవన్ సినిమా అనగానే ఆయన కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. త్వరగా క్రిష్ హీరోయిన్ విషయాన్ని ఖరారు చేసి ఈ కన్ఫ్యూజన్ కు స్వస్థి చెప్పాలని పవన్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
Please Read Disclaimer