పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ క్రేజీ కాంబో ఫిక్స్!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నారు. ఇది కాకుండా క్రిష్ దర్శకత్వం లో మరో పీరియడ్ ఫిలిం కూడా రీసెంట్ గా లాంచ్ అయింది. ఈరెండు సినిమాలే అభిమానులకు డబల్ ట్రీట్ అనుకుంటే పవన్ మరో క్రేజీ సినిమా కూడా ఫిక్స్ అయింది.

మాస్ ఎంటర్టైనర్ల కు కేరాఫ్ అడ్రెస్ అయిన హరీష్ శంకర్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని.. యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు.. టెక్నిషియన్ల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

ఈ సినిమాను అతి త్వరలో లాంచ్ చేస్తారని సమాచారం. ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసిన తీరు ఇప్పటికీ చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఈసారి పవన్ ను హరీష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి. పవన్ రీ-ఎంట్రీ తర్వాత సైన్ చేసిన సినిమాల్లో అన్నిటికంటే క్రేజీ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు.
Please Read Disclaimer