సైకో ట్రైలర్ టాక్

0

సైకో పాథిక్ థీమ్ ఎంచుకుని.. సైకో కిల్లర్ కథాంశాలతో సినిమాలు చేయడం అన్నది సవాల్ లాంటిది. ప్రతి ఫ్రేమ్ ని ఎంతో గ్రిప్పింగ్ గా మలిచి అద్భుతమైన రీరికార్డింగ్.. గ్రేట్ పెర్ఫామెన్సెస్ తో మెప్పించాల్సి ఉంటుంది. హత్యలు .. అనూహ్యమైన వికృత ప్రవర్తన వంటి వాటిని ఎలివేట్ చేయాలంటే దానిపై ప్రత్యేకమైన స్టడీ అవసరం. ఉన్నట్టుండి భయపెట్టేయడం.. థ్రిల్ చేయడం అంటే దానికి అన్నీ కుదరాలి.

అలా కుదిరిన పర్ఫెక్ట్ ట్రైలర్ సైకో. ఇందులో ఎవరూ ఊహించని సంథింగ్ ఏదో ఉంది. భయపెట్టే.. లేదా కొత్తగా ఉంది అని చెప్పుకునే ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్ ని గ్రిప్పింగ్ గా చూపించడంలో మిస్కిన్ సత్తా ఏమిటో కనిపిస్తోంది. పిశాచి- డిటెక్టివ్ లాంటి సినిమాలతో వైవిధ్యమైన కథల్ని ఎంచుకుని నిరూపించుకున్న దర్శకుడిగా మిస్కిన్ కి పేరుంది. ఈసారి సైకోతోనూ అంతకుమించిన ట్రీట్ ఇవ్వబోతున్నాడనే అర్థమవుతోంది. ఇక అతడి సినిమాలు తెలుగులోనూ బాగానే ఆడుతుంటాయి కాబట్టి సైకోకి సక్సెసయ్యే అవకాశం లేకపోలేదు.

తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం విజువల్స్ కట్టి పడేస్తున్నాయి. ఇందులో తల లేకుండా మొండెం వర్షంలో స్నానం చెయ్యడం.. అలాగే సైకో ప్రవర్తన.. రక్తపు చారలు ఇవన్నీ భయపెట్టే ఎలిమెంట్స్. చాలా కొత్తగా వింతగా ఏం జరుగుతోందో సైకో ఎవరో అన్నది తెలీనంతగా గ్రిప్పింగ్ గా చూపించారు ట్రైలర్. ఇందులో ఉదయనిధి స్టాలిన్- అదితి రావు హైదరి- నిత్యామీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు-తమిళంలో రిలీజ్ కానుంది.
Please Read Disclaimer