సైకో వర్సెస్ కాప్! ‘వీ’ కథ మొత్తం లీక్!!

0

నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ తరువాత నటిస్తున్న చిత్రం `వీ`. సుధీర్ బాబుతో కలిసి నాని నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నారు. కొంత విరామం తరువాత నాని.. ఇంద్రగంటి కలిసి చేస్తున్న సినిమా కావడం.. దీన్ని దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. దానికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా ఓ రేంజ్ లో వయొలెన్స్ తో వుంటుందని హీరో నాని హింట్ ఇస్తున్నాడు. ‘వయోలెన్స్ కావాలన్నారుగా ఇస్తా.. ఎడాదికి సాలీడ్ గా ఇస్తా..’ అని నాని సినిమాపై అంచనాల్ని పెంచేశాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ ని తెలివిగా చిత్ర బృందం రివీల్ చేసినట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర బృందం ఈ పోస్టర్ పై కథని రివీల్ చూస్తూ వున్న చిన్న ట్యాగ్ ని ఉంచింది. `ఎట్ దిల్ అవర్ లై ఎట్ మై మెర్సీ ఆల్ మై ఎనీమీస్’ ఈ ట్యాగ్ లైన్ లోనే కథ వుందని అర్థమవుతోంది. ‘ఈ గంటలో నా శత్రువులందరు నా దయ వల్ల ప్రశాంతంగా వున్నారు` అనే అర్థంలో వున్న ఈ ట్యాగ్ లైన్ సినిమా ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేస్తోంది. గ్రేట్ లెజెండరీ రైటర్ విలియమ్స్ షేక్ స్పియర్ రాసిన `ది టెంపెస్ట్` నుంచి ఈ సినిమా ట్యాగ్ లైన్ ని దర్శకుడు తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే `వీ` ఇద్దరు బ్రదర్స్ మధ్య సాగే వార్ గా కనిపించనుందన్నది స్పష్టంగా తెలిసిపోతోంది.

కథ విషయంలో లోతుగా ఆలోచిస్తే ఇందులో నాని- సుధీర్ బాబు బ్రదర్స్ గా కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. నాని సైకో కిల్లర్ గా కనిపిస్తారని.. అతన్ని ఆపే పాత్రలో సుధీర్ బాబు కనిపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. నివేదా థామస్- అదితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 25న సందడి చేయబోతోంది.
Please Read Disclaimer