యువరాణి వారు వచ్చారహో..!

0

టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉన్న భామ పూజ హెగ్డే. టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ కెరీర్లో పైపైకి దూసుకుపోతోంది. ఈమధ్యే ‘గద్దలకొండ గణేష్’ లో గ్లామర్ ఒలకబోసి ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రాణిగా కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ భామ ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో అందాలబొమ్మలాగా ర్యాంప్ వాక్ చేసింది.. చూపరులను కట్టిపడేసింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సిమెంట్ కలర్ ఛోళి.. లెహెంగా ధరించింది. భుజాలకు దుపట్టాతరహాలో వేలాడుతున్న వస్త్రం మొత్తం డ్రస్సుకే కొత్త అందాన్ని తీసుకొచ్చింది. మ్యాచింగ్ ఆభరణాలు.. విభిన్నమైన హెయిర్ స్టైల్ తో వయ్యారంగా నడుస్తూ క్యాట్ వాక్ ను కాస్తా హాట్ వాక్ గా మార్చేసింది. అంతేనా.. హాట్ వాక్ చివర్లో సూపర్ గా ఒక స్టెప్ కూడా వేసి ‘హీరోయిన్’ అనిపించుకుంది. ఇక ఈ స్టెప్ ను చూస్తూ మనీష్ మల్హోత్రా చప్పట్లతో తన జేజేలు తెలిపారు.

ఇదంతా సరే.. ఈ డ్రెస్ లో హైలైట్ ఏంటి అని అడిగితే డీ..ప్ గా ఉన్న వీనెక్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది. ఆ స్టైల్ చూస్తుంటే ఒక యువరాణి లాగా కనిపిస్తోంది. పూజ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. ప్రభాస్ ‘జాన్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది
Please Read Disclaimer