ఇరగదీసిన పున్నూ..అషు జిగేల్..మజా హిమజ

0

బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ చాలా ఎంటర్టైనర్ గా సాగింది. హౌస్ మేట్స్ పోటీ పడి మరి డ్యాన్సులు పాటలు స్కిట్స్ చేసి ప్రేకక్షకులని అలరించారు. ఈ వారం టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ టాలెంట్ షో నిర్వహించారు. బాబా భాస్కర్ – శ్రీముఖిలు జడ్జిలుగా ఉంటారని – మిగతావారు వారి టాలెంట్ తో ఆకట్టుకుని జడ్జిల దగ్గర నుంచి చివరికి యాప్పీ ఫిజ్ ని అందుకునే నలుగురు ఫైనల్లో తలపడతారని ప్రకటించారు.

దీంతో తన టాలెంట్ నిరూపించుకునేందుకు పునర్నవి వచ్చింది. ‘పిలగా ఇరగ ఇరగ’ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి ఇరగదీసింది. దీనికి హౌస్ మేట్స్ తో పాటు జడ్జిలు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. డ్యాన్స్ అయిన తర్వాత బాబా భాస్కర్ – శ్రీముఖీలు పున్నూకి పొగడ్తల వర్షం కురిపించారు. ఇక పునర్నవి తర్వాత అషు మరో హాట్ ప్రదర్శనతో అదరగొట్టింది. రంగస్థలం లోని ‘జిల్ జిల్ జిల్ జిగేలురాజా’ సాంగ్ కి అదిరిపోయేలా డాన్స్ చేసింది.

ఆమె డాన్స్ కి జడ్జ్ శ్రీముఖీతో పాటూ బాబా కూడా షాక్ అయ్యాడు. అంతలా డ్యాన్స్ వేస్తావని అనుకోలేదని పొగుడుతూ అషుకి యాప్పీ ఫిజ్ ఇచ్చారు. ఇక తర్వాత రితిక ఒక కళ్లు లేని అమ్మాయిలా నటించి.. కళ్లు డొనేట్ చెయ్యండి అని మంచి మెసేజ్ ఇచ్చింది. అలాగే శివజ్యోతి అగ్గి పెట్టెలో చీర పట్టిస్తా – గారడీ చేస్తా – మ్యాజిక్ చేస్తానంటూ.. అందరికి షాక్ ఇచ్చి నవ్వుతెప్పించింది. లోపల పుల్లలు పెట్టేది తీసేసి – ఉత్తి బాక్స్ నుండి చీరని లాగి కామెడీ చేసింది. దీంతో బాబా భాస్కర్ దగ్గరకి పిలిచి చెవులో నీ కాళ్ళు మొక్కుతా వెళ్లిపో అన్నాడు. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

తర్వాత వచ్చిన హిమజ.. ఓ చక్కనోడా సాంగ్ సాంగ్ ని తప్పు తప్పుగా పాడుతూ.. అందరినీ నవ్వించింది. మధ్యలో బ్రేకులు వేసి పాడి ఎంటర్టైన్ చేసింది. పాట పూర్తయ్యాక అయిపోయిందని హిమజా చెప్పడంతో ఇంటి సభ్యులు మజా మజా హిమజా అంటూ జై కొట్టారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home