పున్నూ దెబ్బకు కమిట్ మెంటలే

0

బిగ్ బాస్ ఫేం పునర్నవి భూపాలం క్రేజు గురించి చెప్పాల్సిన పనే లేదు. ఉయ్యాల జంపాల సినిమాలో క్యూట్ హీరోయిన్ అవికాగోర్ కి స్నేహితురాలిగా నటించి కుర్రకారు మనసు దోచిన పున్నూకి అప్పటి నుంచే భారీగా ఫ్యాన్ బేస్ పోగైంది. ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ ఈ బబ్లీ బ్యూటీకి ఆయాచితంగా కలిసొచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్ గ్రూపుల్లో పున్నూ పేరు మార్మోగిపోయింది. బిగ్ బాస్ సీజన్ విజేత అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం ఎపిసోడ్స్ కూడా పున్నూ క్రేజు ను పదింతలు చేశాయి. ఓవరాల్ గా ఇవన్నీ తన కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతున్నాయి ఇప్పుడు.

ఇటీవల ఆహా-తెలుగు ఇచ్చిన అవకాశాన్ని ఈ అమ్మడు సద్వినియోగం చేసుకుంది. ఇందులో ఒరిజినల్ కంటెంట్ కి పున్నూ లాంటి ట్యాలెంట్ అవసరం ఎంతైనా ఉంది. కమిట్ మెంటల్ పేరుతో ఆహా ఒరిజినల్ సిరీస్ పలు ఎపిసోడ్లుగా రూపొందిస్తే అందులో అద్భుతమైన కామెడీ టైమింగుతో పున్నూ మ్యాజిక్ చేసింది. అనూ-ఫనీస్ కమిట్మెంటల్ కైండ్ లవ్ అంటూ బోలెడంత హంగామా సృష్టించారు. ఓవైపు డిజిటల్ కంటెంట్ .. మరోవైపు టీవీ రియాలిటీ షోలతో బోలెడంత ఉపాధి పొందుతున్న పునర్నవికి పెద్ద తెర ఆఫర్లకు కొదవేమీ లేదు. ఇటీవల కరోనా క్రైసిస్ ఉన్నా తనకు ఆఫర్లు కరువేమీ కాలేదట. మరోవైపు కమర్షియల్ ప్రకటనల్లోనూ పున్నూ మెరుస్తోంది. ప్రఖ్యాత డేనియల్ వెల్డింగ్టన్ వాచెస్ కి పున్నూ ప్రచారం చేస్తోందంటే రేంజు ఎలా పెరిగిందో అర్థం చేసుకోవాలి.

ఇక సోషల్ మీడియాల్లో పునర్నవి ఇస్పీడ్ చూస్తే అడ్డూ ఆపూ లేదు. అక్కడ స్పైసీ ఫోటోషూట్లతో అభిమానుల కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిస్తోంది ఈ తెలుగమ్మాయి. ఇదిగో ఇటీవలే ఈ ఫ్లోరల్ డిజైన్ లుక్ లో పునర్నవి మరింత అందంగా మెరిసిపోతూ ఆకర్షిస్తోంది. `ఉమెన్స్ క్రంచ్ – వెడ్నెస్ డే` అంటూ ఆహా వీడియోస్ లో ఈ లుక్ వైరల్ అయ్యింది. పున్నూ సింపుల్ లుక్ తో ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ ఫోటోలో. యువతరం వాట్సాపులు ఇన్ స్టాల్లో వైరల్ గా మారింది.