లవర్స్ డేకి పునర్నవి గిఫ్ట్ ప్రకటించేసింది!

0

‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ తదితర చిత్రాలతో వెండితెర ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయిన పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ షో‌తో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ వరుస చిత్రాలను లైన్‌లో పెట్టింది. ఆమె నటించిన ‘ఒక చిన్న విరామం’ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

బిగ్ బాస్‌లో హాట్ బ్యూటీగా ఫుల్ క్రేజ్

బిగ్ బాస్ సీజన్ 3లో తన హాట్ హాట్ అందాలతో హౌస్‌కి గ్లామర్ హంగులు అద్దిన పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ తరువాత సెగలు రేపే ఫొటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. తనది బుల్లితెరకు మాత్రమే పరిమితం చేసే పీస్ కాదని.. వెండితెరపై వెలుగులు విరజిమ్మే క్వాలిటీస్ తనలో చాలానే ఉన్నాయి అంటూ చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు రేపే ఫొటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తోంది.

ఒక చిన్న విరామం అంటున్న పున్నూ

‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ తదితర చిత్రాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో తనలోని గ్లామర్ యాంగిల్‌కి పదునుపెట్టి ‘ఒక చిన్న విరామం’ అనే థ్రిల్లింగ్, యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమా చేసింది పునర్నవి భూపాలం.

లవర్స్ డేకి పున్నూ ‘ఒక చిన్న విరామం’

బిగ్ బాస్ సీజన్ 3 అప్పుడు హోస్ట్ నాగార్జున ఈ మూవీ టీజర్‌ను చూపించారు. కాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ప్రేమికులు దినోత్సవం కానుకగా పునర్నవి నటించిన ‘ఒక చిన్న విరామం’ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు.

ఒక చిన్న విరామం చిత్ర విశేషాలు.. నటీనటులు

పునర్నవి భూపాలం, గరిమ సింగ్, సంజయ్ వర్మ, నవీన్ నేని ప్రధాన తారగణంగా నటించిన ఈ మూవీ డిఫరెంట్ కథాంశంతో రోడ్ ప్రయాణంలో సాగే థ్రిల్లింగ్ కథతో రూపొందించారు. ఈ చిత్రానికి సందీప్ చేగురి దర్శకత్వం వహించి ఆయనే స్వయంగా నిర్మించారు.

ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతున్నా..

ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పునర్నవి మాట్లాడుతూ..‘బిగ్ బాస్ తరువాత మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అన్నపూర్ణ స్కూల్ నుండి వచ్చిన వారు. కచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త సినిమా అవుతుంది. భారత్ మచిరాజు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను, డైరెక్టర్ సందీప్ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తోంది’ అని అన్నారు పునర్నవి.
Please Read Disclaimer