బిగ్ బాస్ మీద ఫైర్ అయిన పున్నూ!

0

బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి టాస్క్ ఇస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇంటి సభ్యులకు టాస్క్ వల్ల ఇబ్బంది కలగకూడదని చెబుతూనే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే పని చేస్తాడు. మంగళవారం ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ అలాంటి టాస్క్ ఇచ్చాడు. లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా దెయ్యాలుగా బాబా భాస్కర్ – హిమజ – శిల్ప – రాహుల్ – వితికలు ఉండగా – మనుషులుగా శ్రీముఖి – వరుణ్ – రవి – మహేశ్ – పునర్నవి – శివజ్యోతిలు ఉన్నారు.

దెయ్యాలుగా ఉన్నవారు ఒకో టాస్క్ చేసి మనుషులని చంపేసి…వారు మనుషులుగా మారాలి. ఇక దెయ్యం చేతిలో చచ్చిపోయిన వారు మళ్ళీ దెయ్యంగా మారుతారు. ఇక ఆట మొదలు కాగానే దెయ్యాలు టాస్క్ చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగా మొదట వితికా.. వరుణ్ కి ముద్దుల వర్షం కురిపించి మిర్రర్ పై వరుణ్ ఘోస్ట్ అని రాసింది. దీంతో వితికా మనిషిగా మారి – వరుణ్ దెయ్యంగా మారాడు. ఇక తర్వాత శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టడంతో హిమజ మనిషిగా మారి శ్రీముఖి దెయ్యం అయ్యింది.

చివరికి ఇంటి సభ్యులందరూ కలిసి పునర్నవిని స్విమ్మింగ్ పూల్ తో తోసేయడంతో రచ్చ అయ్యింది. అయితే చాలా సేపు స్విమ్మింగ్ పూల్ లో ఉండిపోయిన పున్నూ తిరిగి పైకి ఎక్కి కూర్చుంది. ఈ సందర్భంగా శిల్పా వచ్చి మళ్లీ స్విమ్మింగ్ పూల్ లోకి తోసేయడంతో పున్నూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే వెంటనే దెయ్యం అయిన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయిందని.. శిల్ప మనిషిగా – పునర్నవి దెయ్యంగా మారతారని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో పున్నూ ఒక్కసారిగా బిగ్ బాస్ మీద ఫైర్ అయ్యింది.

అసలు బుల్ షిట్ టాస్క్ ఇచ్చారని – శిల్ప తనను దారుణంగా లాగి పడేస్తుంటే రియాక్ట్ కాకుండా ఎలా ఉంటారని ఆవేశ పడింది. ఇష్టం వచ్చినట్టు ఈడ్చేస్తుంటే నాకు ఎక్కడెక్కడ తగిలిందో తెలుసా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వాళ్లు అలా చేస్తున్నా గేమ్ అయ్యే వరకూ తాను రియాక్ట్ కాలేదని – ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారని వరుణ్ తో చెబుతూ బాధపడింది. బిగ్ బాస్ తో మాట్లాడటం కోసం ఎదురుచూస్తున్నా అని – మీ ఆటను మీరే ఆడుకోండి – మాకు చెప్పింది ఏంటి ఇక్కడ చేస్తుంది ఏమిటి? నన్ను ఈడ్చుకుంటూ పోతుంటే బాధ ఉండదా? నేను ఈ గేమ్ ఆడనని అంటూ బిగ్ బాస్ ను ఏకిపారేసింది. ఇక ఈ గేమ్ బుధవారం కొనసాగనుంది.
Please Read Disclaimer