ఆమె ప్రాణ స్నేహితురాలు మాత్రమే

0

రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పునర్నవి అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి. శ్రీముఖితో గొడవ.. పునర్నవితో పులిహోర మరియు తాను ఒక బార్బర్ ను అని చెప్పుకోవడంకు సిగ్గు పడకపోవడం వల్లే నేడు రాహుల్ బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా నిలిచాడు అంటూ టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా బిగ్ బాస్ టైటిల్ ను రాహుల్ గెలుచుకుని లక్కీ పర్సన్ అయ్యాడు. ఒక సింపుల్ సెలబ్రెటీగా జర్నీ ప్రారంభించిన రాహుల్ ట్రోఫీ దక్కించుకోవడంలో పునర్నవి ప్రోత్సాహం తనకు చాలా ఉందని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూలో పునర్నవి గురించి రాహుల్ మాట్లాడుతూ.. నాకు పునర్నవికి ప్రేమ అంటూ బయట చాలా ప్రచారం జరుగుతుందని విన్నాను. అలాంటిది ఏమీ లేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. మనం ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటాం చూడండి తను కూడా నాకు ప్రాణ స్నేహితురాలు. పున్ను నాకు ప్రాణ స్నేహితురాలు మాత్రమే అని అంతకు మించి ఏమీ లేదని.. నాలో తనలో అలాంటి ఆలోచనలు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చాడు. ఆమె నాకు చాలా ఇన్సిపిరేషన్. నన్ను తిట్టి కొట్టి బూతులు తిట్టి బుద్దిగా చెప్పి మరీ నేను ఆట ఆడేలా చేసింది. నేను తప్పు చేసినప్పుడు ప్రశ్నించడంతో పాటు నేను టాస్క్ లను లైట్ తీసుకోకుండా చేసింది.

నాకు ఈ జర్నీలో వరుణ్.. వితిక మరియు పునర్నవిలు గొప్ప స్నేహితులుగా నిలిచారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు విన్నర్ గా నిలిచానంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో శ్రీముఖి గురించి మాట్లాడుతూ ఆమె నాకు మంచి స్నేహితురాలు.. టాస్క్ ల సమయంలో చిన్న చిన్న లొల్లి అయినా కూడా మేమిద్దరం మంచి స్నేహితులం.. చివరి వారంలో ఇద్దరం చాలా కలిసి పోయాం అంటూ చెప్పుకొచ్చాడు.
Please Read Disclaimer