‘బిగ్ బాస్’ అంతా అంతే.. లోపల జరిగేది వేరే: యంగ్ హీరోయిన్

0

బిగ్ బాస్ బ్యూటీ పునర్వవి భూపాలం.. అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే ఈరోజుల్లో బిగ్ బాస్ ప్రోగ్రాం చూడని వాళ్లు ఉండరు. ముఖ్యంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్లు అందరూ గుర్తుంటారు. ఇక సినిమాలతో రాని గుర్తింపును బిగ్ బాస్ రియాలిటీ షోతో దక్కించుకుంది పునర్నవి. ప్రస్తుతం పునర్నవి అందచందాలకు మెరుగులు దిద్దేపనిలో పడిందట. ప్రస్తుతం అమ్మడికి సినిమా అవకాశాలేవీ లేవని అర్ధమవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎంతగా ఆకట్టుకున్నా సినిమా అవకాశాలు మాత్రం అందనంత దూరంగానే ఉంటున్నాయి. చేసేదేం లేక ఈ తెలుగందం.. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫోటోలు ఫోజులతో అభిమానుల మనసులు కొల్లగొడుతూ ఫేమస్ అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ వర్కౌట్స్తో బొద్దు అందాలను నాజూకుగా మార్చేందుకు చెమటలు చిందిస్తోందట అమ్మడు.

నిజంగా పునర్నవి ఫోటోషూట్లతో తన అందాలను కొసరికొసరి వడ్డిస్తోంది. ఇక తాజాగా పునర్నవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “బిగ్బాస్ షో అనేది మొత్తం ఎడిట్ చేసి చూపిస్తారని.. లోపల ఏం జరిగినా సరే వారికి నచ్చినట్టుగా మార్చుతారని చెప్పింది. రోజు మొత్తంలో ఎంతో జరుగుతుంది. కానీ వారికి కావాల్సిన పుటేజ్ను ఎడిట్ చేసి గంట మాత్రమే చూపిస్తారు. అది చూసి జనాలు అదే నిజమని ఫిక్స్ అయిపోతారు. అయితే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. ఇక ఇప్పటికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితో టచ్లో ఉన్నాను. అందరూ బాగా మాట్లాడతారు. అప్పుడప్పుడు ఈవెంట్లకు కూడా పిలుస్తుంటారు. కానీ నాకు టైం ఉంటేనే ఉంటే వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. మరి బిగ్ బాస్ తర్వాత ఏ ఈవెంట్లో కూడా కనిపించలేదు కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పునర్నవి ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.
Please Read Disclaimer