పున్నూ.. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయిందా? లేదా ప్రమోషన్స్ లో భాగమా?

0

‘బిగ్ బాస్’ 3 కంటెస్టెంట్ నటి పునర్నవి భూపాలం నిన్న(బుధవారం) ఇన్స్టాగ్రామ్ లో తన ఫొటో షేర్ చేస్తూ ”చివరకు.. ఇది జరుగుతుంది” అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు.. అంతేగాక పున్నూ ఫింగర్ కి డైమండ్ రింగ్ కూడా ఉంది. దీంతో పునర్నవి నిశ్చితార్థం జరిగిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాబోయే భర్తను చూపించాలంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా ”నేను ఎస్ చెప్పాల్సి వచ్చింది.. ఉద్భవ్ నేను కలిసి రేపు బిగ్ డే గురించి మీకు చెప్తాను” అని పునర్నవి ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. దీంతో ఉద్భవ్ ని పున్నూ పెళ్లి చేసుకోబోతుందని అతని గురించి ఆరా తీశారు. యూట్యూబర్ అయిన ఉద్భవ్ రఘునందన్ పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించాడు. ‘చికాగో సుబ్బారావు’ అనే యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్నాడు.

ఇదే సమయంలో ఉద్భవ్ రఘునందన్ ఇన్స్టాగ్రామ్ లో పునర్నవి భూపాలం తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ‘ఆమె ఎస్ చెప్పింది. రేపు బిగ్ డే గురించి మీకు చెప్పడానికి వెయిట్ చేయలేకపోతున్నాం’ అని పోస్ట్ పెట్టాడు. దీంతో పునర్నవి – ఉద్భవ్ పెళ్లి ఫిక్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఒక వారం క్రిందట ఉద్భవ్ పోస్ట్ చూస్తే ఇదంతా వారిద్దరూ కలిసి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించేమో అనే అనుమానం కలుగుతోంది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పునర్నవితో ఉంటుందని.. అతి త్వరలో మీకు చూపించడానికి వెయిట్ చేయలేకపోతున్నాను.. నవంబర్ 13ను మార్క్ చేసి పెట్టుకోండి అని ఉద్భవ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఆహా కోసం పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్న ‘పర్మినెంట్ రూమ్ మేట్స్’ తెలుగు రీమేక్ లో పునర్నవి – ఉద్భవ్ కలిసి నటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్భవ్ – పునర్నవి ఇద్దరూ ఊరిస్తూ వస్తున్న బిగ్ డే వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్ అయ్యుంటుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి ఫిక్స్ అయిందా లేదా ఇదంతా ప్రమోషన్స్ లో భాగమేనా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.