ప్రేమికుల గుట్టు బయటపెట్టిన పప్పీ ఇదేనా?

0

అక్కినేని నాగచైతన్య – సమంత ల ప్రేమకథ గురించి తెలిసిందే. ఈ ప్రేమకథలో తొలిసారి గుట్టు కనిపెట్టింది ఎవరో తెలుసు కదా? అక్కినేని నాగార్జునకు కానీ.. అమలకు కానీ .. లేదా అఖిల్ కి కానీ వీరి ప్రేమ గురించి అప్పటికి తెలియదట. ఓసారి చైతూ- సమంత ల ప్రేమ సీక్రెట్ ని తమకు రివీల్ చేసింది ఒక పప్పీ అంటూ నాగార్జున స్వయంగా వెల్లడించడం ఆశ్చర్యపరిచింది. ఇంట్లో ఎవరికీ తెలియని గుట్టు కాస్తా ఆ పప్పీకే తెలిసిందని దానివల్లనే తాము తెలుసుకోగలిగామని అన్నారు.

అయితే ఆ పప్పీ ఇదేనా కాదా? అన్నది అటుంచితే .. చైతూ – సమంతలతో ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయిన ఈ పప్పీ పేరు హాష్. ఇదిగో కరోనా దిగ్భందనం వల్ల కుటుంబమంతా ఏకమై ఎంత పెద్ద రచ్చ చేస్తోందో. అందులో పప్పీ గారి గారాబం చూస్తుంటే ముచ్చట పడకుండా ఉండలేం. చైతూ.. సామ్ తో కలిసి ఇది ఎక్సర్ సైజులు కూడా చేస్తోంది మరి. సమంత అక్కినేని ఇన్ స్టాగ్రామ్లో పెంపుడు పప్పీతో కలిసి దిగిన ఫోటోల్ని షేర్ చేశారు. `#quaranteam` అంటూ సామ్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ జంట హాష్ అని పిలిచే ఈ అందమైన కుక్కపిల్ల అతి పిన్న వయస్కురాలు. సామ్ -చై ఇదివరకూ హాష్ అక్కినేని మొదటి పుట్టినరోజును కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ దంపతులు సన్నిహితులు కలిసి పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక పార్టీని నిర్వహించారు. ఇప్పుడు స్వీయ దిగ్బంధం సమయంలో ఇంట్లో నాగ చైతన్య తో హాష్ చిద్విలాసం చూస్తుంటే ఎవరికైనా అసూయ కలగకుండా ఉంటుందా?

ఇక కెరీర్ పరంగా చూస్తే నాగ చైతన్య ప్రస్తుతం కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చిత్రంలో నటిస్తున్నాడు. సమంత విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతు వాకులా రేండు కదల్’ లో నయనతారతో కలిసి నటించనుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-