పార్టీ అన్న పూరి టీమ్.. సరే సరే అన్న జోహార్ గారు!

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం క్రేజీ యువ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈమధ్యే నలభై రోజుల షూట్ పూర్తి చేసుకుందని పూరి కనెక్ట్స్ టీమ్ ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ప్యాన్ -ఇండియన్ ఫిలింగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కు సంబంధించి అంతా ఆయనే చూసుకుంటారు. అంతే కాదు. ఈ సినిమాలో హీరోయిన్ అనన్య పాండే కూడా ఆయన రిఫరెన్సేనని టాక్ ఉంది.

ఇదిలా ఉంటే నిన్న ఈ సినిమా టీమ్ కరణ్ జోహార్ టీమ్ తో కలిసి సరదాగా గడిపారు.. పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో విజయ్ దేవరకొండ.. అనన్య పాండే.. పూరి జగన్నాధ్.. ఛార్మి లతో పాటుగా కరణ్ జోహార్.. చుంకీ పాండే తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఛార్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. “బ్యూటిఫుల్ ఈవెనింగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్” అంటూ చెప్పుకొచ్చారు. “మంచి మనుషులతో ఓ సరదా సాయంత్రం” అని మనం తర్జుమా చేసుకోవచ్చు. హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల స్టైల్ లో అయితే “అందమైన మనుషుల తో అందమైన సాయంత్రం” అని కఠోర అనువాదం చేసుకోవాలి.

మరోవైపు కరణ్ జోహార్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజయ్ దేవరకొండ-అనన్య పాండే ఫోటో పోస్ట్ చేసి “వెండితెరపై త్వరలో సంచలనం సృష్టించబోతున్నారు #విజయ్ దేవరకొండ #అనన్య పాండే” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో విజయ్.. అనన్యలు సూపర్ స్మైల్ ఇచ్చారు.. మరి నిజంగానే సంచలనం సృష్టిస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-