జాన్వీతో పూరి సంప్రదింపుల స్టేటస్ ఏంటీ?

0

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఎట్టకేలకు హిట్ కొట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనుకున్నట్లుగానే విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. ‘ఫైటర్’ అనే టైటిల్ ను పూరి ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం పూర్తి అయిన తర్వాత పూరి మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం మొదట నభా నటేష్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్.. శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ తో పూరి చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరిగింది. బాలీవుడ్ లో తనకున్న పరిచయాలతో బోణీ కపూర్ ను పూరి కలిశాడని.. కథ వినేందుకు బోణీ కపూర్ మరియు జాన్వీ కపూర్ లు ఒప్పుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

త్వరలోనే జాన్వీ కపూర్ ను కలిసి స్క్రిప్ట్ ను వినిపించేందుకు దర్శకుడు పూరి రెడీ అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో పూరి ఉన్నాడు. కథ నచ్చితే విజయ్ దేవరకొండతో నటించేందుకు జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు హీరోల్లో తనకు జాన్వీ కపూర్ అంటే ఇష్టం అంటూ ఒక టాక్ షో లో జాన్వీ కపూర్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా రచ్చ రచ్చే అంటూ సినీ అభిమానులు ఆశిస్తున్నారు.
Please Read Disclaimer