డాషింగ్ డైరెక్టర్ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ హీరో ఎవరు..?

0

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. పూరీ ఏ సినిమా చేసినా ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి వారిని స్టార్ హీరోలను చేసిన ఘనత కూడా ఉంది. అందుకే మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చిన పూరి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే పూరి మళ్లీ సూపర్ హిట్ అందుకున్నాడు. ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టడమే కాకుండా.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చాడు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో పూరి సినిమాలు చేశారు. ఏ హీరోకైనా కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. పూరితో సినిమా అంటే అది ప్రత్యేకమే.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు పూరి. అయితే ఇటీవల పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ త్వరలో రూపొందిస్తారని వార్తలొస్తున్నాయి. జనగణమన సినిమా దేశభక్తితో కూడిన కథాంశంతో తెరకెక్కించనున్నాడని అంటున్నారు. కానీ గతంలో ఈ సినిమా ప్రస్తావన వచ్చిన తరవాత పూరి చాలా సినిమాలు చేశాడు. దీంతో ‘జనగణమన’ సినిమా మూలన పడిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ‘జగనణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్. త్వరలోనే ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను’ అని పూరి జగన్నాథ్ ప్రకటించడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేగాక దీన్ని పాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా తరవాత ‘జనగణమన’ను పట్టాలెక్కిస్తారని టాక్. అయితే ఈ మూవీలో హీరో ఎవరనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. పోకిరి.. బిజినెస్మేన్.. సినిమాల తర్వాత జనగణమన మహేష్ తో చేయాలనీ అనుకున్నాడట పూరీ. కానీ మహేష్ కథ నచ్చక నో చెప్పినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు స్క్రిప్ట్ పూర్తి పకడ్బందిగా ఫినిష్ చేసాడట. ఇదిలా ఉండగా.. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో పెద్ద ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు. కనీసం రెండు మూడేళ్లయినా డేట్స్ దొరకడం కష్టం అంటున్నారు. మరి పూరీ అప్పటివరకు వెయిట్ చేస్తాడా.. లేక వేరే హీరోతో తీస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer